నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు



నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు
అవి నీళ్లే..
గొంతు తడపలేని నీళ్లు..
ఎటుచూసినా.. నీళ్లు..
వీథుల్లోనా..కాలువల్లోనా..
కుంటల్లో..నదుల్లో..ప్రవాహమై..
చెత్తా-చెదారాన్ని తనలో నింపుకొని..
బురదమయమై.. ఎర్రగా...
ఉరుగులు-పరుగులు పెడుతూ..
గట్టులు తెగకోసేస్తూ..
సాధారణ జీవితాల్ని భయపెట్టేస్తూ..
బంధాల్ని తెంచేస్తూ..
తన తడాఖా చూపిస్తూ..
జీవాల్ని దరి చేరనీయకుండా..
భయాందోళనకు గురి చేస్తూ..
వరదగా..ఉప్పెనగా..
అహాన్ని ప్రదర్శిస్తూ..
తన గమ్యానికి పరుగులు పెడుతూ..
నమ్ముకున్న జీవజాలానికి..భయోత్పాతమై..
వాటి గుండెల మీద దరువేసుకుంటూ..
నియమాల్ని తెంచేసుకుంటూ.
ఉరిమి - ఉరిమి చూస్తున్న నీళ్లు..
మురికి నుండి వేరయ్యేదాకా..
తన బలుపు తగ్గేదాకా..
నిలకడయై ..నిర్మలంగా నిలిచేదాకా..
చెత్తా-చెదారాన్ని విడచేదాకా..
తనలో మలినం అడుగంటేదాకా..
ప్రకృతిలో తనది గెలుపేది..!
తను ఉపయోగమేది ..!
తన పరమార్థమేది..!

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?