//ఎవరున్నారిలా!!//
/ ఎవరున్నారిలా !! / శ్రమ నీ సొత్తు .. శ్రమను ప్రేమించే మనిషికి నీవు ఒక మురిపెం ఒక ప్రేరణ... ఎన్ని పదులు దాటితేనేమి అనుభవ సారాన్ని రంగరించుకున్న మీ మనసు యువకెరటమే! భావి తరాల ఆశవై.. దూర దృష్టి నీవై... ప్రతి పనిలో రేపటిని చూస్తూ నడిచే ప్రతి అడుగుకి అక్షర సుమాంజలి బడుగు బలహీన జీవితాల ముందడుగుకి ఓ ధైర్యం మీరందించే చేయూత స్నేహానికి భాష్యం చెప్పిన తీరు పంచుకోవాల్సిన తీపి మిఠాయిలే 'చెట్టు - చేమ బతకాలని నీ వంతు శ్రమదానవ్వాలని జన్మ నిచ్చిన నేల ఋణం కొంతైనా తీర్చుకోవాలని నీటిని నిల్వ చేయాలని పొదుపుగా వాడాలని అదో గొప్ప సందేశం నదుల అనుసంధానం లోక కళ్యాణ కార్యం మీ సంకల్పం అఖండం దీక్షా దక్షత మీ సొంతం సుందర నగరాలు మీ తేజాలు చేయి చేయి తోడై నేను సైతమంటూ అడుగున అడుగై నడిచి రాగా తెలుగు వెలుగు తేజోదీప్తమై జగమంతా పున్నమి వెన్నెలై వేనోళ్ళ కొనియాడబడదా!!