Posts

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు అవి నీళ్లే.. గొంతు తడపలేని నీళ్లు.. ఎటుచూసినా.. నీళ్లు.. వీథుల్లోనా..కాలువల్లోనా.. కుంటల్లో..నదుల్లో..ప్రవాహమై.. చెత్తా-చెదారాన్ని తనలో నింపుకొని.. బురదమయమై.. ఎర్రగా... ఉరుగులు-పరుగులు పెడుతూ.. గట్టులు తెగకోసేస్తూ.. సాధారణ జీవితాల్ని భయపెట్టేస్తూ.. బంధాల్ని తెంచేస్తూ.. తన తడాఖా చూపిస్తూ.. జీవాల్ని దరి చేరనీయకుండా.. భయాందోళనకు గురి చేస్తూ.. వరదగా..ఉప్పెనగా.. అహాన్ని ప్రదర్శిస్తూ.. తన గమ్యానికి పరుగులు పెడుతూ.. నమ్ముకున్న జీవజాలానికి..భయోత్పాతమై.. వాటి గుండెల మీద దరువేసుకుంటూ.. నియమాల్ని తెంచేసుకుంటూ. ఉరిమి - ఉరిమి చూస్తున్న నీళ్లు.. మురికి నుండి వేరయ్యేదాకా.. తన బలుపు తగ్గేదాకా.. నిలకడయై ..నిర్మలంగా నిలిచేదాకా.. చెత్తా-చెదారాన్ని విడచేదాకా.. తనలో మలినం అడుగంటేదాకా.. ప్రకృతిలో తనది గెలుపేది.. ! తను ఉపయోగమేది .. ! తన పరమార్థమేది.. !

మన భావితరమెటువైపు..

మన భావితరమెటువైపు.. చదువులమ్మ అంగడిజేరింది.. , వేలు-లక్షలంటూ తాను పలుకుతోంది.. ! మార్కులు-గ్రేడుల్లో తనని చూడమంటోంది.. ! విద్య వ్యాపారమై..భావితరాలకి శాపమై... , కుటిల మనిషికి జీవమై..స్వార్థాలకు ఆయువై.. , ప్రతిభను తోచేస్తూ..వ్యష్టిలో ముంచేస్తూ.. , మనిషిని యంత్రంగా మార్చేస్తూ..మనుగడని ప్రశ్నిస్తోంది.. ! ఆడుతూ..పాడుతూ..గెంతులేస్తూ... , అంతరంగాన్ని మదింపుజేస్తూ.. , అనుభవాల సారాన్ని కూడగట్టుకుంటూ.. , విలువలతో బ్రతుకు బండిని ముందుకు నడిపించుకుంటూ.. , మానవతా విలువలతో..మహోపకారియై.. , విలువైన సమాజంగా నిలబడలేకపోతోందే.. ? సమస్యల సుడిగుండాల పరిష్కారమే చదువు.. తానే సమస్యయై..సుడిగుండమై..తిరుగుతూ.. సామాజికాన్ని ఆలోచనలో పడవేసిందే.. ? బంగారు బాల్యానికి కంటినిండా నిద్దురేది.. ? ఒత్తిడిలో కనుమూస్తోందే.. ! ర్యాగింగ్ భూతానికి బలియైపోతోందే.. !! ఇంటిలోన-వీథిలోన,బడిలోన, ఎటుచూసినా..., ర్యాంకులు-మార్కులనుచూ వెక్కిరించగా.. ! బట్టీల చదువులు..ప్రతిభను చిదిమేస్తుంటే.. , బండబారిపోయెనే బాల మేథస్సు.

బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు..

బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు.. బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు.. ప్రేక్షితం భక్షయేన్మాంసం బ్రాహ్మాణానాం చ కామ్యయా ! ( మనుధర్మ శాస్త్రం , ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం.) - బ్రాహ్మణులు మాంసం తినవలెనని కోరిక కలిగినపుడు తినవచ్చు. యఙాయ జగ్ధిర్మాంసస్యేత్యేష దైవో విధి:స్మృత: ! ( ముప్పై ఒకటవ శ్లోకం) - యఙం కొరకు పశువులను వధించడం , మాంసభక్షణ చేయడం దైవోచిత కార్యము. నియుక్తస్తు యథాన్యయాయంయో మాంసం నాత్తి మానవ: ! స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిమ్ !! ( ముప్పై ఐదవ శ్లోకం) - శ్రాద్ధాది కర్మలందు తమ పితరులకు విధిపూర్వకంగా మాంసం అర్పణం చేసి తను మాంసాన్ని భుజించని యెడల ముప్పై ఒక్క జన్మలు పశు యోని యందు జన్మించును. పై శ్లోకాలను నిశితంగా పరిశీలిస్తే మాంసము ఆహారములో భాగంగా తీసుకోవలసిందిగా చెప్పబడుతోంది. శ్రాద్ధ కర్మలందు పితరులకు , దేవతలకు మాంసం అర్పించవలెనని శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది. మాంసాహారులని ఎందుకు శూద్రులను వేరు చేసి చూస్తారో ! శాస్త్రం రాసిందెవరు..ఆ రాసినవారు తమకు అనుకూలంగా ఎన్ని లొసుగులతో రాసుకున్నారో అర్థమవుతుంది. శూద్రులు చదువుకుంటే ఙానవంతులై ఇవన్నీ ప