మన భావితరమెటువైపు..

మన భావితరమెటువైపు..
చదువులమ్మ అంగడిజేరింది..,
వేలు-లక్షలంటూ తాను పలుకుతోంది..!
మార్కులు-గ్రేడుల్లో తనని చూడమంటోంది..!
విద్య వ్యాపారమై..భావితరాలకి శాపమై...,
కుటిల మనిషికి జీవమై..స్వార్థాలకు ఆయువై..,
ప్రతిభను తోచేస్తూ..వ్యష్టిలో ముంచేస్తూ..,
మనిషిని యంత్రంగా మార్చేస్తూ..మనుగడని ప్రశ్నిస్తోంది..!

ఆడుతూ..పాడుతూ..గెంతులేస్తూ...,
అంతరంగాన్ని మదింపుజేస్తూ..,
అనుభవాల సారాన్ని కూడగట్టుకుంటూ..,
విలువలతో బ్రతుకు బండిని ముందుకు నడిపించుకుంటూ..,
మానవతా విలువలతో..మహోపకారియై..,
విలువైన సమాజంగా నిలబడలేకపోతోందే..?
సమస్యల సుడిగుండాల పరిష్కారమే చదువు..
తానే సమస్యయై..సుడిగుండమై..తిరుగుతూ..
సామాజికాన్ని ఆలోచనలో పడవేసిందే..?
బంగారు బాల్యానికి కంటినిండా నిద్దురేది..?
ఒత్తిడిలో కనుమూస్తోందే..!
ర్యాగింగ్ భూతానికి బలియైపోతోందే..!!
ఇంటిలోన-వీథిలోన,బడిలోన, ఎటుచూసినా...,
ర్యాంకులు-మార్కులనుచూ వెక్కిరించగా..!
బట్టీల చదువులు..ప్రతిభను చిదిమేస్తుంటే..,
బండబారిపోయెనే బాల మేథస్సు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....