బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు..



బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు..

బ్రాహ్మణులు మాంసాహారాన్ని భుజించవచ్చు..
ప్రేక్షితం భక్షయేన్మాంసం బ్రాహ్మాణానాం చ కామ్యయా !
(
మనుధర్మ శాస్త్రం, ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం.)
-
బ్రాహ్మణులు మాంసం తినవలెనని కోరిక కలిగినపుడు తినవచ్చు.
యఙాయ జగ్ధిర్మాంసస్యేత్యేష దైవో విధి:స్మృత: !
(
ముప్పై ఒకటవ శ్లోకం)
-
యఙం కొరకు పశువులను వధించడం, మాంసభక్షణ చేయడం దైవోచిత కార్యము.
నియుక్తస్తు యథాన్యయాయంయో మాంసం నాత్తి మానవ: !
స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిమ్ !!
(
ముప్పై ఐదవ శ్లోకం)
-
శ్రాద్ధాది కర్మలందు తమ పితరులకు విధిపూర్వకంగా మాంసం అర్పణం చేసి తను మాంసాన్ని భుజించని యెడల ముప్పై ఒక్క జన్మలు పశు యోని యందు జన్మించును.
పై శ్లోకాలను నిశితంగా పరిశీలిస్తే మాంసము ఆహారములో భాగంగా తీసుకోవలసిందిగా చెప్పబడుతోంది.
శ్రాద్ధ కర్మలందు పితరులకు ,దేవతలకు మాంసం అర్పించవలెనని శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది.
మాంసాహారులని ఎందుకు శూద్రులను వేరు చేసి చూస్తారో !
శాస్త్రం రాసిందెవరు..ఆ రాసినవారు తమకు అనుకూలంగా ఎన్ని లొసుగులతో రాసుకున్నారో అర్థమవుతుంది.
శూద్రులు చదువుకుంటే ఙానవంతులై ఇవన్నీ ప్రశ్నిస్తారని
వారికి చదువులేకుండా చేశారు.ఆ లొసుగులన్నీ పటాపంచలు చేస్తూ కుటిల తంత్రాలను ప్రశ్నిస్తూ మన యుగం ముందుకు నడుస్తోంది.
మెతుకు పట్టుకొని చెప్పవచ్చు అన్నం ఉడికిందా లేదాయని.
అలాగే నాటి సవర్ణ సమాజం శూద్ర వర్ణాలకి దళితులకు చేసిన మోసం, అన్యాయం,అక్రమాల పుట్టలు బద్దలవుతున్నాయి.
ఆలోచిద్దాం ...నిజమేంటో ..మన అంతరాత్మని ప్రశ్నిద్దాం.
మనిషిగా జీవిద్దాం.ఏ పనీ తక్కువ కాదు..అలాగే ఏ పనీ ఎక్కువా కాదు.దేని గొప్పదనం దానిదేనని గ్రహిద్దాం.
అందుకే రహీమ్ అంటారు..
రహిమన్ దేఖి బడే్న్ కో లఘు న దీజియే డారీ !
జహాఁ కామ్ ఆవై సుఈ కహాఁ కరై తరవారీ! !
-
పెద్దవాటిని చూసి చిన్న వాటిని ఉపేక్షించవద్దు.ఎక్కడైతే సూది పని ఉందో అక్కడ కత్తితో ఏమి చేయగలవు .
భావార్థమేమంటే సృష్టిలో దేని విలువ దానికుంది. ఏ వ్యక్తిని, వస్తువును తక్కువగా చూడకు.ఆకారాన్ని బట్టి స్థితిని బట్టి గొప్పవని అహంభావాన్ని కలిగి ఉండకు.
శ్రీ.శ్రీ గారంటారు...హీనంగా చూడకు దేన్నీ..కవితామయమేనోయ్ అన్నీ..
కుక్కపిల్ల,సబ్బుబిల్ల,అగ్గిపుల్ల కాదేది కవితకనర్హమోయ్.
మహానుభావులు మేధోమథనం గావించి మనకందించిన అమూల్య సందేశాలను నెమరేసుకుంటూ భావి భారతాన్ని ఉజ్వలబాటన తీసుకెళ్లదాం.
కులం,మతం స్వార్థాలకు నెలవు కాకూడదు.మానవత్వాన్ని మంటగలిపే మూఢాలు కాకూడదు.మానవాళికి మహోపకారి కావాలి.అనాదిగా మనమధ్యనున్న వర్ణ,కుల,మత వైషమ్యాలను తోసేసి నిజమైన మానవతా మతం వైపు నడుద్దాం.మతం జెండా,కులపు డండా ,పార్టీల అడ్డాలు .బ్రతుకు తెరువుకు పోరాటాలే . ఎవరి ఆత్రం వారిది. గెలుపుకై ఆరాటాలు.వెనక్కి తిరిగి చూసుకుంటే గెలిచిందేదో ఓడిందేదో తెలియలేదు.గెలవాల్సింది జీవితాన్ని.పుట్టిందెందుకో గతించిందెందుకో తెలియకనే జీవమెళ్లిపోతోంది .మన మధ్యనున్న జాతి కులాల్ని సూచిస్తూ పేరుకు జోడింపులేమిటో..ఏకులం తక్కువ ఎక్కువా కాదు.అందరి సహకారమై నడిస్తేనే సుఖమయమైన బ్రతుకు.
ప్రతివారు వారి వారి గొప్పలకు పోయి విడిపోతే సుఖజీవనమెక్కడున్నది.ఆలోచిద్దాం.మనం తినే అన్నం భోజనం అంటాం.భో + జనం. అంటే జనం యొక్క శక్తి అని.భోజనం సకల మానవాళి సమ్మిళిత రూపం.ఎందరి శ్రమో ..భగవంతుడు సర్వాంతర్యామి.అందుగలడు ఇందులేడని సందేహము వలదు.అంతటా శక్తియే నిండియున్నది. అది దైవము కాదా...శక్తియే దైవం.సకల చరాచరము దైవ రూపము కాదా..!
మార్పును స్వీకరిద్దాం.
మంచికి అడుగులేద్దాం.
ఆచరణలో మేటిగా నిలబడదాం.
కుతంత్రాల మత మౌఢ్యాలనుండి విడివడి నీతి నిజాయితీకి నడుం కడదాం.
జై భారత్ ..జై భీం..సంఘం శరణం గచ్ఛామి.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?