నేను..నా జీవితము.

 నేను..నా జీవితము.
నా పూర్వీకుల ఆత్మలు అమాయకత్వాన్ని చుట్టుకుని పడి ఉన్నాయి.
కళింగ రాజ్యాన్ని జయించాలని తపించి హతాశుడైన అశోకుని స్థితి నాది.
గ్వాలియర్,ఝాన్సీ చేజారిపోయి నిరుత్సాహపు నిట్టూర్పులు విడుస్తున్న లక్ష్మీబాయి పరిస్థితి నాది.
విశ్వాంతరాళలో నుండి ఏ అద్భుత శక్తి నాలో చేరడం లేదు.
జనాలను వొప్పించే మాటలు చెప్పి జేజేలు పలికించుకునే వశీకరణ మనస్థితి నాలో లేదు.
నాది సాధారణ జన్మమని నేనేప్పుడూ అనుకోలేదు.
విశ్వ మానవాళికి నేనేమి ఇవ్వగలనో తెలియలేదు.
గుడ్డిగా తారాడుతూ జీవితాన్ని గడిపేయలేను.
శరీరాన్ని నమ్ముకొని నేనేప్పుడూ నడవలేదు.
కరిగిపోయే మంచుగడ్డ పట్టుకోనీ కూర్చోలేదు.
నేను రేపటి సమాజాన్ని చూస్తున్నాను....
సుందర భావి భారతాన్ని పరికిస్తున్నాను....
ఆనంద నిలయానికి ఇటుకలు పేరుస్తున్నాను. 
గాంధీ,రవీంద్రుని కలలూ  నన్ను తడుతున్నాయి..
అంబేద్కరుని దివ్యాశ్సీసులు  నామీదున్నాయి..
ఒళ్లు తెలియకుండా నేను నిద్దురపోలేదు..
ప్రపంచమే హద్దుగా నా మనస్సు పరుగులు పెడుతూనే ఉంది.
కార్యదేహమని నిరూపణ చేసుకొంటోంది..






Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?