Posts

గుడారాల జీవితాలు..

గుడారాల జీవితాలు.. శ్రమకు ప్రతి రూపాలు. ఎండా-వాన , చలి-గిలి , మట్టి -బురదా , అన్నీ ఒకటై నడిచే బతుకులు. జీవతానికే అర్థమై .. కనుల ముందు నిలచి ఎన్నో భవనాలకి రూపమిచ్చి ఎందరి సుఖాలకో శ్రమను ధారవోసి వాటికి దూరంగా నిలచిన మన పేదవాని జీవిత సత్యాలు. కూలి దొరకలేదు..పొయ్యి మండలేదు నిలువ జాగాలేదు..బతుకు బండి నిలువలేదు ప్రేగులు వీపున కట్టుకుని నడుస్తుంటే ... జీవిత పోరాటంలో .. గెలుపు బావుటా ఎగురవేస్తూ.. సాగుతున్న మన అభాగ్యపు జీవితాలు.

ఉరుము ఉరవలేదు

ఉరుము ఉరవలేదు ఉరుము ఉరవలేదు మెరుపు మెరవలేదు పుడమి దాహం తీరలేదన్నట్లు నీటి ధార ఆగలేదు నదులు-సెలయేళ్లు , వంకలు-వాగులు , చెరువులు కుంటలు తొణికిసలాడుతూ ఉరుకు-పరుగులు పెడుతుంటే గట్టు మీది జీవితాలు కన్నీటిలో తేలాడుతూ వరద ఉప్పెనలా ఉసిగొనుచూ.. పదేళ్ల తరుతాతొచ్చా... లేటుగా లేటెస్టుగా వచ్చానంటూ ఊరిమీదకు ఉరుముతోందే!

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు అవి నీళ్లే.. గొంతు తడపలేని నీళ్లు.. ఎటుచూసినా.. నీళ్లు.. వీథుల్లోనా..కాలువల్లోనా.. కుంటల్లో..నదుల్లో..ప్రవాహమై.. చెత్తా-చెదారాన్ని తనలో నింపుకొని.. బురదమయమై.. ఎర్రగా... ఉరుగులు-పరుగులు పెడుతూ.. గట్టులు తెగకోసేస్తూ.. సాధారణ జీవితాల్ని భయపెట్టేస్తూ.. బంధాల్ని తెంచేస్తూ.. తన తడాఖా చూపిస్తూ.. జీవాల్ని దరి చేరనీయకుండా.. భయాందోళనకు గురి చేస్తూ.. వరదగా..ఉప్పెనగా.. అహాన్ని ప్రదర్శిస్తూ.. తన గమ్యానికి పరుగులు పెడుతూ.. నమ్ముకున్న జీవజాలానికి..భయోత్పాతమై.. వాటి గుండెల మీద దరువేసుకుంటూ.. నియమాల్ని తెంచేసుకుంటూ. ఉరిమి - ఉరిమి చూస్తున్న నీళ్లు.. మురికి నుండి వేరయ్యేదాకా.. తన బలుపు తగ్గేదాకా.. నిలకడయై ..నిర్మలంగా నిలిచేదాకా.. చెత్తా-చెదారాన్ని విడచేదాకా.. తనలో మలినం అడుగంటేదాకా.. ప్రకృతిలో తనది గెలుపేది.. ! తను ఉపయోగమేది .. ! తన పరమార్థమేది.. !

మన భావితరమెటువైపు..

మన భావితరమెటువైపు.. చదువులమ్మ అంగడిజేరింది.. , వేలు-లక్షలంటూ తాను పలుకుతోంది.. ! మార్కులు-గ్రేడుల్లో తనని చూడమంటోంది.. ! విద్య వ్యాపారమై..భావితరాలకి శాపమై... , కుటిల మనిషికి జీవమై..స్వార్థాలకు ఆయువై.. , ప్రతిభను తోచేస్తూ..వ్యష్టిలో ముంచేస్తూ.. , మనిషిని యంత్రంగా మార్చేస్తూ..మనుగడని ప్రశ్నిస్తోంది.. ! ఆడుతూ..పాడుతూ..గెంతులేస్తూ... , అంతరంగాన్ని మదింపుజేస్తూ.. , అనుభవాల సారాన్ని కూడగట్టుకుంటూ.. , విలువలతో బ్రతుకు బండిని ముందుకు నడిపించుకుంటూ.. , మానవతా విలువలతో..మహోపకారియై.. , విలువైన సమాజంగా నిలబడలేకపోతోందే.. ? సమస్యల సుడిగుండాల పరిష్కారమే చదువు.. తానే సమస్యయై..సుడిగుండమై..తిరుగుతూ.. సామాజికాన్ని ఆలోచనలో పడవేసిందే.. ? బంగారు బాల్యానికి కంటినిండా నిద్దురేది.. ? ఒత్తిడిలో కనుమూస్తోందే.. ! ర్యాగింగ్ భూతానికి బలియైపోతోందే.. !! ఇంటిలోన-వీథిలోన,బడిలోన, ఎటుచూసినా..., ర్యాంకులు-మార్కులనుచూ వెక్కిరించగా.. ! బట్టీల చదువులు..ప్రతిభను చిదిమేస్తుంటే.. , బండబారిపోయెనే బాల మేథస్సు.