గుడారాల జీవితాలు..



గుడారాల జీవితాలు..


శ్రమకు ప్రతి రూపాలు.
ఎండా-వాన ,చలి-గిలి,మట్టి -బురదా,
అన్నీ ఒకటై నడిచే బతుకులు.
జీవతానికే అర్థమై ..
కనుల ముందు నిలచి
ఎన్నో భవనాలకి రూపమిచ్చి
ఎందరి సుఖాలకో శ్రమను ధారవోసి
వాటికి దూరంగా నిలచిన
మన పేదవాని జీవిత సత్యాలు.
కూలి దొరకలేదు..పొయ్యి మండలేదు
నిలువ జాగాలేదు..బతుకు బండి నిలువలేదు
ప్రేగులు వీపున కట్టుకుని నడుస్తుంటే ...
జీవిత పోరాటంలో ..
గెలుపు బావుటా ఎగురవేస్తూ..
సాగుతున్న మన అభాగ్యపు జీవితాలు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....