Posts

జీవితానికి ఎన్ని గిరులు...

జీవితానికి ఎన్ని గిరులు... జీవితానికి ఎన్ని గిరులు... కులం-మతం , వర్ణం-వర్గం , సంప్రదాయాలు , కట్టుబాట్లు , ఆస్థి పాస్తులు , ఎన్నో అహంభావాలు ఇవన్నీ దాటేదెప్పుడు!! మనిషి పాషాణ హృదయం నుండి మానవత్వాన్ని చేరేదెప్పుడు!! మానవత్వాన్ని దాటి దైవాన్ని చేరేదేజన్మకు!! మనిషి జంతవుపై గెలవొచ్చు.. తన పెంపుడుగా మార్చుకోవచ్చు.. మనిషి మనిషిపై ఆధిపత్యం సాధించవచ్చు.. బానిసగా చూడవచ్చు.. అదే గెలుపు గొప్పనుకుంటే... ఇంతకంటే అవివేకమేముంది ? ప్రకృతిపై గెలవడం తనవల్ల అయిందా..!! మరి. .! ఎందుకు పుట్టాడో .. తను తెలుసుకునేదెప్పుడు.. ? కుళ్లు తంత్రాల గుప్పిట్లో... తాను మహారాజు అనిపించుకోవడం .. ఏ పాటి.. ? జననం -మరణం మధ్యలో తన ఆట సంతు -తంతు గుట్టులో తన ఆటలేమవుతాయో. . ? భోగ -భాగ్యం ..తనల్లుకొన్న సాలెగూడ్లు.. తరువాత ఏమవుతాయో.. ? జంతువు మనిషిగా మారినా ... ప్రగతియనే పేరే గానీ.. తన గుణమెక్కడ పోయింది ?

గుడారాల జీవితాలు..

గుడారాల జీవితాలు.. శ్రమకు ప్రతి రూపాలు. ఎండా-వాన , చలి-గిలి , మట్టి -బురదా , అన్నీ ఒకటై నడిచే బతుకులు. జీవతానికే అర్థమై .. కనుల ముందు నిలచి ఎన్నో భవనాలకి రూపమిచ్చి ఎందరి సుఖాలకో శ్రమను ధారవోసి వాటికి దూరంగా నిలచిన మన పేదవాని జీవిత సత్యాలు. కూలి దొరకలేదు..పొయ్యి మండలేదు నిలువ జాగాలేదు..బతుకు బండి నిలువలేదు ప్రేగులు వీపున కట్టుకుని నడుస్తుంటే ... జీవిత పోరాటంలో .. గెలుపు బావుటా ఎగురవేస్తూ.. సాగుతున్న మన అభాగ్యపు జీవితాలు.

ఉరుము ఉరవలేదు

ఉరుము ఉరవలేదు ఉరుము ఉరవలేదు మెరుపు మెరవలేదు పుడమి దాహం తీరలేదన్నట్లు నీటి ధార ఆగలేదు నదులు-సెలయేళ్లు , వంకలు-వాగులు , చెరువులు కుంటలు తొణికిసలాడుతూ ఉరుకు-పరుగులు పెడుతుంటే గట్టు మీది జీవితాలు కన్నీటిలో తేలాడుతూ వరద ఉప్పెనలా ఉసిగొనుచూ.. పదేళ్ల తరుతాతొచ్చా... లేటుగా లేటెస్టుగా వచ్చానంటూ ఊరిమీదకు ఉరుముతోందే!

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు

నీ ళ్లు..ఎటుచూసినా.. నీళ్లు అవి నీళ్లే.. గొంతు తడపలేని నీళ్లు.. ఎటుచూసినా.. నీళ్లు.. వీథుల్లోనా..కాలువల్లోనా.. కుంటల్లో..నదుల్లో..ప్రవాహమై.. చెత్తా-చెదారాన్ని తనలో నింపుకొని.. బురదమయమై.. ఎర్రగా... ఉరుగులు-పరుగులు పెడుతూ.. గట్టులు తెగకోసేస్తూ.. సాధారణ జీవితాల్ని భయపెట్టేస్తూ.. బంధాల్ని తెంచేస్తూ.. తన తడాఖా చూపిస్తూ.. జీవాల్ని దరి చేరనీయకుండా.. భయాందోళనకు గురి చేస్తూ.. వరదగా..ఉప్పెనగా.. అహాన్ని ప్రదర్శిస్తూ.. తన గమ్యానికి పరుగులు పెడుతూ.. నమ్ముకున్న జీవజాలానికి..భయోత్పాతమై.. వాటి గుండెల మీద దరువేసుకుంటూ.. నియమాల్ని తెంచేసుకుంటూ. ఉరిమి - ఉరిమి చూస్తున్న నీళ్లు.. మురికి నుండి వేరయ్యేదాకా.. తన బలుపు తగ్గేదాకా.. నిలకడయై ..నిర్మలంగా నిలిచేదాకా.. చెత్తా-చెదారాన్ని విడచేదాకా.. తనలో మలినం అడుగంటేదాకా.. ప్రకృతిలో తనది గెలుపేది.. ! తను ఉపయోగమేది .. ! తన పరమార్థమేది.. !