జీవితానికి ఎన్ని గిరులు...





జీవితానికి ఎన్ని గిరులు...


జీవితానికి ఎన్ని గిరులు...
కులం-మతం,వర్ణం-వర్గం,
సంప్రదాయాలు,కట్టుబాట్లు,
ఆస్థి పాస్తులు,ఎన్నో అహంభావాలు
ఇవన్నీ దాటేదెప్పుడు!!
మనిషి పాషాణ హృదయం నుండి
మానవత్వాన్ని చేరేదెప్పుడు!!
మానవత్వాన్ని దాటి దైవాన్ని చేరేదేజన్మకు!!
మనిషి జంతవుపై గెలవొచ్చు..
తన పెంపుడుగా మార్చుకోవచ్చు..
మనిషి మనిషిపై ఆధిపత్యం సాధించవచ్చు..
బానిసగా చూడవచ్చు..
అదే గెలుపు గొప్పనుకుంటే...
ఇంతకంటే అవివేకమేముంది?
ప్రకృతిపై గెలవడం తనవల్ల అయిందా..!!
మరి. .!
ఎందుకు పుట్టాడో ..
తను తెలుసుకునేదెప్పుడు..?
కుళ్లు తంత్రాల గుప్పిట్లో...
తాను మహారాజు అనిపించుకోవడం ..
ఏ పాటి..?
జననం -మరణం మధ్యలో తన ఆట
సంతు -తంతు గుట్టులో తన ఆటలేమవుతాయో. .?
భోగ -భాగ్యం ..తనల్లుకొన్న సాలెగూడ్లు..
తరువాత ఏమవుతాయో..?
జంతువు మనిషిగా మారినా ...
ప్రగతియనే పేరే గానీ..
తన గుణమెక్కడ పోయింది?

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....