నీకే నమస్కరిస్తున్నాను..

నీకే నమస్కరిస్తున్నాను..
పందిరి వేసేది నీవు..
పలక వాయించేది నీవు
దివిటి మోసి దారి చూపేది నీవు
అందరిని ఉర్రూతలూగిస్తూ..
ఆనందపుటూయల మోసేది నీవు.
నీవుంటేనే సందడి..
ఐకమత్యానికి అనురాగానికి..
నీశ్రమే వేదిక.
జాతి విషాన్ని మ్రింగి..
అమృతాన్ని పంచుతున్నావు.
ఒకరివెనుకొకరు నడిచేట్లు చేస్తున్నావు.
ప్రతి పనిలో నీవున్నావు..
సమాజానికి నీవే వెన్నెముక
నాగరికతకు ప్రతీక.
తినే దగ్గర జాతి భేదంతో...
దూరం చేయబడుతున్నావు.
త్యాగానికి మారు పేరై నీవుంటే..
నిన్ను చూస్తూ నేను మురిసిపోతున్నాను.
నిన్ను చూస్తూ నీలో లీనమవుతున్నాను.
రాతి బొమ్మలకు నమస్కరించాలన్న ...
భక్తి నాలో కలగలేదు..
నీవే దైవమై కనిపిస్తున్నావు..
నీకే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?