Posts

తగునా తల్లీ నీకిది ?!

                       తగునా తల్లీ నీకిది ?!        పైడాల రవీంద్ర నాథ్ జి.ప.ఉ.పాఠశాల,చక్రంపేట. నిటలాక్షప్రియా ! నిర్మలానంద నిఖిలాంబా ! నిర్ఝరీ ! నిరంతర ప్రవాహశీలీ ! నిన్ను వేడుకొందునే... !! దాహార్తివై ముప్పదిరెండు ప్రాణంబులనేల? నీ పొట్టనింపుకుంటివో ? భక్తకోటి జన సంద్రానికి దుఖమున్నింపితివేల ? తగునా నీకిది ? గంగేశ్వరీ ! కమనీయ శోభిత వారిణీ ! శుభఘడియలనుచూ నీదుచెంతనెంత సంతసముతోడ తొణికిసలాడుతూ నిన్ను సృర్శించి తరించు రమణీయ తరుణాన ఒకరినొకరు తొక్కుకొని గంతించు ఘడియనేల కాపాడకుంటివో ? కరుణాంతరంగినీ ! తెలుగు ప్రదేశానికి నీవొక వరదాయినివే ! మాజీవితాలకి వెలుగై వేనోళ్ళ కొనియాడబడుచున్న వీనుల విందుగా మామది నిండుగా నిలచిన నీవేల మిన్నకుంటివో నీకు కలిగినపర్యాదమేమిటో తనయుల తప్పులను తల్లినెప్పుడూ తూలనాడదే మరియేల మా మానసంబున శోకసంద్రము చేసితివో ? మహిమాన్వితా ! దివ్య తేజోమయీ ! సకలప్రియగౌతమీ !

నాయకుడా..!

                                         నాయకుడా ..!                                                                                            రచన :   పైడాల రవీంద్రనాథ్    అమావాస్య అంధకారాన్ని   చీల్చుకుంటూ రావయ్యా.. దశ-దిశల నీవై      నిండు పున్నమివై రావయ్యా.. నిరంతర శ్రామికుడవే    అలుపెరగని యోధుడవే... పట్టువదలని విక్రమార్కుడవే     భగీరథశ్చంద్రునివే... రాత్రి- పగలు తేడా లేదు   ఎండా-వానా తెలియలేదు.. సుత్తి దెబ్బలు తిన్న రాతివోలే     ఘన కీర్తిని బొందెదవే... మెరిసే తారలు ఎక్కిరించినా      నీ చిరునవ్వు తొణకదుగా... ప్రజా క్షేమమే నీ ధ్యేయమై ..    ముందడుగేయు నాయకుడా.. ! అమావాస్య అంధకారాన్ని   చీల్చుకుంటూ రావయ్యా.. దశ-దిశల నీవై    నిండు పున్నమివై రావయ్యా.. కరువు రక్కసి కోరల్ని     పీకివేయనడుగేసినావు.. నదులానుసంధానమే    లక్ష్యంగా చేసుకున్నావు.. తాగునీరు-సాగునీరంటూ     ప్రాజెక్టులెన్నో చేబట్టినావు.. వరుణుడు కరుణించకున్నా     కొంచెమైనా తొణకకున్నావు.. పేదరికం వెన్నాడుతున్నా      జంకులేక నిలబడుతున్నావు.. ధైర్యమే నీ ఆయుధమా ..!   మనోబలమే నీ
ఓ భారత పుత్రా!  ఓ భారత పుత్రా!  ఎంగిలి విస్తర్లలో మిగిలిన  అరకొర అన్నంతో  నీపొట్డ నింపుకొంటున్నావా!! నాన్న తాగి ఏ మూల పడిపోయాడో!  అమ్మ చేతి కష్టం నీ పొట్ట నింపలేకపోయిందో!  పదేళ్ళు కూడా నిండని నీ ప్రాయానికి  ఏపని చేయగలవు!!  ఓ భారత పుత్రా!  గోడమీద నుండి ఎగిరొచ్చిపడే  ఎంగిలి ఆకుకోసం ఎంత ఆత్రుతో!  కాలువలో పడ్డా ..సరిగ్గా ఒడిసి పట్టలేకపోయినా ఎంగిలి మెతుకులు నీనోటికి చేరవు కదా!    ఓ భారత పుత్రా!   కోటాను కోట్ల రూపాయల వాళ్ల పెళ్ళంటే నీలో ఆశల సందడి చిందులేస్తుందా!  రాచమర్యాదల ఏ.సీ .జీవితాలు  నీ వైపు తొంగైనా చూడలేదా!! సౌభ్రాతృత్వం, సమానత్వం  బాబా సాహెబ్ కలలు నిన్ను తాకలేదా!  అరవై ఏళ్ళ స్వాతంత్ర్యపు హక్కులు  నీవద్దకు చేరనేలేదా!!  ఓ భారత పుత్రా!  అంతరంగంలోని ఆవేదన  మానవ సమాజాన్ని ప్రశ్నించే రోజు  మానవత్వం తలదించనుంది!  నీవు నలిగిపోతున్న రేపటి సమాజానివి.  ప్రకృతిలోని సత్యాలని పసిగట్టగలిగే  దివ్యఙాన జ్యోతివి..  ఙానాంధకారానికి నీవే దిక్సూచివి..  నీవే  నిజమైన సత్యానివి.

कुछ नहीं जानता

कुछ नहीं जानता मेरी साहित्य साधना का अभी कोई नहीं रहा मनोहर गुरू एकलव्य की एकांत साधना आत्मा में अंकुठित दीक्षा अंतराल में अखंड संवेदना उद्वेलित उखाड़ता मुझे नित्य । मेरा जन्म हुआ पिछड़े जाति में चिंतन - मनन कभी नहीं पिछड़े दौड़ - धूप की इस दुनिया में उच्चकोटि का विचार मेरा । अनजानी पीड़ा मेरी साथी हरपल आलोकित करती जिंदगी मालूम नहीं मुझे रचना शैली उठते - गिरते मानवता के सामने अवश्य खड़े हो जाता किसी दिन । मँडराते मानवता के भौंरे बन मधुमय मंजुल वाणी ला देता अखंड संसार का भागीदारी समझता मैं सकल प्राणीकोटि का इन्हीं से चलता जीवन गाड़ी इनके बिना मैं कुछ नहीं जानता ।