తగునా తల్లీ నీకిది ?!



                       తగునా తల్లీ నీకిది ?!     పైడాల రవీంద్ర నాథ్ జి.ప.ఉ.పాఠశాల,చక్రంపేట.
నిటలాక్షప్రియా ! నిర్మలానంద నిఖిలాంబా!
నిర్ఝరీ ! నిరంతర ప్రవాహశీలీ ! నిన్ను వేడుకొందునే...!!

దాహార్తివై ముప్పదిరెండు ప్రాణంబులనేల?
నీ పొట్టనింపుకుంటివో ? భక్తకోటి జన సంద్రానికి
దుఖమున్నింపితివేల ? తగునా నీకిది ?
గంగేశ్వరీ ! కమనీయ శోభిత వారిణీ !
శుభఘడియలనుచూ నీదుచెంతనెంత
సంతసముతోడ తొణికిసలాడుతూ
నిన్ను సృర్శించి తరించు రమణీయ తరుణాన
ఒకరినొకరు తొక్కుకొని గంతించు ఘడియనేల
కాపాడకుంటివో ? కరుణాంతరంగినీ !
తెలుగు ప్రదేశానికి నీవొక వరదాయినివే !
మాజీవితాలకి వెలుగై వేనోళ్ళ కొనియాడబడుచున్న
వీనుల విందుగా మామది నిండుగా నిలచిన
నీవేల మిన్నకుంటివో నీకు కలిగినపర్యాదమేమిటో
తనయుల తప్పులను తల్లినెప్పుడూ తూలనాడదే
మరియేల మా మానసంబున శోకసంద్రము చేసితివో?
మహిమాన్వితా ! దివ్య తేజోమయీ ! సకలప్రియగౌతమీ!

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?