నాయకుడా..!



                                       నాయకుడా..!                

                                                                          రచన :  పైడాల రవీంద్రనాథ్  
అమావాస్య అంధకారాన్ని  చీల్చుకుంటూ రావయ్యా..

దశ-దిశల నీవై     నిండు పున్నమివై రావయ్యా..

నిరంతర శ్రామికుడవే   అలుపెరగని యోధుడవే...
పట్టువదలని విక్రమార్కుడవే   భగీరథశ్చంద్రునివే...
రాత్రి- పగలు తేడా లేదు  ఎండా-వానా తెలియలేదు..
సుత్తి దెబ్బలు తిన్న రాతివోలే    ఘన కీర్తిని బొందెదవే...
మెరిసే తారలు ఎక్కిరించినా    నీ చిరునవ్వు తొణకదుగా...
ప్రజా క్షేమమే నీ ధ్యేయమై ..   ముందడుగేయు నాయకుడా..!

అమావాస్య అంధకారాన్ని  చీల్చుకుంటూ రావయ్యా..

దశ-దిశల నీవై   నిండు పున్నమివై రావయ్యా..


కరువు రక్కసి కోరల్ని   పీకివేయనడుగేసినావు..
నదులానుసంధానమే   లక్ష్యంగా చేసుకున్నావు..
తాగునీరు-సాగునీరంటూ   ప్రాజెక్టులెన్నో చేబట్టినావు..
వరుణుడు కరుణించకున్నా   కొంచెమైనా తొణకకున్నావు..
పేదరికం వెన్నాడుతున్నా     జంకులేక నిలబడుతున్నావు..
ధైర్యమే నీ ఆయుధమా ..!  మనోబలమే నీ సంపదా..!

ప్రజా క్షేమమే నీ ధ్యేయమై.. ముందడుగేయు నాయకుడా..!

అమావాస్య అంధకారాన్ని  చీల్చుకుంటూ రావయ్యా..

దశ-దిశల నీవై     నిండు పున్నమివై రావయ్యా..

తెలుగు ప్రదేశ కీర్తిని        నలువైపులా విస్తరిస్తున్నావు..
తెలుగోడి గుండె గూటిలో    దేదీప్యమై వెలుగొందుతున్నావు..
భరతమాత ముద్దుబిడ్డవై     వేనోళ్ళ కొనియాడబడుతున్నావు..
దేశ-దేశాలలో తిరుగాడుతూ     తెలుగు వన్నె చూపిస్తున్నావు..
ఎన్నో ఆటుపోటులకు       నీదైన శైలిలో జవాబిస్తున్నావు..
ధైర్యమే నీ ఆయుధమా..!    మనోబలమే నీ సంపదా..!

ప్రజా క్షేమమే నీ ధ్యేయమై.. ముందడుగేయు నాయకుడా..!

అమావాస్య అంధకారాన్ని   చీల్చుకుంటూ రావయ్యా..

దశ-దిశల నీవై    నిండు పున్నమివై రావయ్యా..


Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?