ఓ భారత పుత్రా!

 ఓ భారత పుత్రా!

 ఎంగిలి విస్తర్లలో మిగిలిన
 అరకొర అన్నంతో
 నీపొట్డ నింపుకొంటున్నావా!!
నాన్న తాగి ఏ మూల పడిపోయాడో!
 అమ్మ చేతి కష్టం నీ పొట్ట నింపలేకపోయిందో!
 పదేళ్ళు కూడా నిండని నీ ప్రాయానికి
 ఏపని చేయగలవు!!

 ఓ భారత పుత్రా!
 గోడమీద నుండి ఎగిరొచ్చిపడే
 ఎంగిలి ఆకుకోసం ఎంత ఆత్రుతో!
 కాలువలో పడ్డా ..సరిగ్గా ఒడిసి పట్టలేకపోయినా
ఎంగిలి మెతుకులు నీనోటికి చేరవు కదా!
 
 ఓ భారత పుత్రా! 
 కోటాను కోట్ల రూపాయల వాళ్ల పెళ్ళంటే
నీలో ఆశల సందడి చిందులేస్తుందా!
 రాచమర్యాదల ఏ.సీ .జీవితాలు
 నీ వైపు తొంగైనా చూడలేదా!!
సౌభ్రాతృత్వం, సమానత్వం
 బాబా సాహెబ్ కలలు నిన్ను తాకలేదా!
 అరవై ఏళ్ళ స్వాతంత్ర్యపు హక్కులు
 నీవద్దకు చేరనేలేదా!!

 ఓ భారత పుత్రా!
 అంతరంగంలోని ఆవేదన
 మానవ సమాజాన్ని ప్రశ్నించే రోజు
 మానవత్వం తలదించనుంది!
 నీవు నలిగిపోతున్న రేపటి సమాజానివి.
 ప్రకృతిలోని సత్యాలని పసిగట్టగలిగే
 దివ్యఙాన జ్యోతివి..
 ఙానాంధకారానికి నీవే దిక్సూచివి..
 నీవే  నిజమైన సత్యానివి.





































































































Comments

Post a Comment

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....