Posts

మన అమరావతి.. మన సంస్కృతి.

మన అమరావతి.. మన సంస్కృతి. ఏమున్నతి అంధ్రప్రదేశ్ చెంతన... లోటు బడ్జెట్ తో.. పేదరికాన.. మట్టిని-నీటిని నమ్ముకుని.. ధైర్యమే పెట్టుబడిగా... సాహసమే తన ఊపిరిగా సంకల్పమే బలంగా.. వడి -వడిగా.. అడుగులేస్తూ.. నూతన రాజధానిగా.. అంకురార్పణ చేసుకుందే... మన అమరావతి... రైతన్న త్యాగం.. ఆదర్శమయిందే.. అన్నంబెట్టే అన్నపూర్ణను.. అమరావతికి రూపమవ్వగా.. పులకించెనే దేవతలు సైతము.. ఎన్నో ఆశలు-ఆశయాలు.. రైతన్న కళ్లల్లో కనబడుతుంటే.. నావంతు కర్తవ్యమంటూ.. నడిచిందే ఆంధ్ర దేశమంతా.. సంప్రదాయాలకి.. మారుపేరుగా.. సాటెవ్వరనిపించిందా.. దివ్యభూమి.. పేదరికాన్ని పేగున కట్టేసుకుని.. ఆథిత్యమిచ్చిందా.. మనతెలుగు జాతి.. భారత దేశానికే గర్వమై.. ధాన్యగారమై.. నిలచిందే.. ఘనంగా...చరిత్రలోన.. దేశానికే తలమానికమై.. ప్రపంచానికే వెలుగైన ఒకనాటి చరిత.. కొనియాడబడిందే... మన జన్మభూమి.. చేయి-చేయి కలుపుకుంటూ.. నడవంగా సామాన్యుడూ.. భాగమై నిలవంగా.. శక్తిలో.. యుక్తిలో... భక్తిలో.. కొదవేది తెలుగు జాతిలోన.. సాధించలేనిదేముంది.. ఇలలోన.. విశ్వమే.. అచ్చెరువొందదా... మన సంకల్ప బలముజూడంగా..

రాజస్థాన్.. రాజ్యమా..

రాజస్థాన్.. రాజ్యమా..  రాజస్థాన్.. రాజ్యమా.. రాచరికపు ఉన్మాదమా.. మనిషిని మనిషిగా... చూడలేకున్నావెందుకు..! ఒకటా.. రెండా.. రోజుకోచోట ఏదో ఓ రూపంలో.. దళితులపై దమన కాండలెందుకో.. కఠినమై.. కర్కశమై.. మానవత్వం మరచిపోయి... హింసలేమిటో.. నీ ధర్మమేమిటో... సభ్య సమాజం.. ఈసడించుకొనేలా.. ఆకృత్యాలేమిటో..  మన నేల అహింసకు ఆనవాళ్లు.. సత్యానికి.. ధర్మానికి.. కీర్తి పతాకం.. బుధ్ధుని ఆదర్శమై.. అశోక ధర్మ చక్రమై... మహోన్నత సమతావాద దేశమై.. ప్రపంచాన ఘన చరిత తనపేర శాశ్వతంగా నిలుపుకొన్నదే... కులమేంది.. మతమేంది.. మనమంతా మనుష్యులం.. కోతి నుంచే మనిషి మనుగడ కాదా.. వర్ణం కాదు.. వర్గం కాదు.. కలిసి బతకడం కావాలి.. శ్రమించే దెవరైనా.. చెయ్యెత్తి జైకొట్టాలే... మంచికై.. లోకం మెచ్చేలా.. భరతమాత మురిసేలా... మన మనుగడుండాలె..

మురిసెనే ..మన తెలుగోడి గుండె...

మురిసెనే ..మన తెలుగోడి గుండె... నగర శోభను సంతరించుకుంటూ... చిన్నివన్నెలొలుకుచూ..కళ-కళలాడుచూ .. కవులు..పండితుల..   దివ్యారాధనలో..   నవ్యాంధ్ర.. తేజో దీప్తిపుంజమై... అలరారు ..అమరావతి సొబగులుజూడ.. మురిసెనే..మన తెలుగోడి గుండె... పుణ్యంగా పుట్టమన్ను..పవిత్రంగా కలశాలు.. తెలుగువారి ఐక్యతగా ..తరలివచ్చెనే.. ఊరువాడ-పిల్లజెల్ల..సందడి జేయంగా.. తెలుగునాట సంబరం..అంబరాన్నంటుచుండ... మురిసెనే..మన తెలుగోడి గుండె... ఇంద్రుడు-చంద్రుడు..   దేశ-దేశాల పాలకులెందరో.. అమరావతిని మనసారా..దీవించరాగా... తెలుగుప్రదేశాన పండుగై..పర్వదినమైన వేళ.. పవిత్రమై.. పరిడవిల్లుచున్న..మనరాజధానిజూడగా.. మురిసెనే..మన తెలుగోడి గుండె... బుద్ధుని ఆశీస్సులు చల్లంగా తాకుచుండ... కనకదుర్గ ..కమనీయ కాంతులీనువేళ.. నవ్యమై..భవ్యమై..అమరావతి అజరామమై.. చరిత్రలో మరోపేజీ..తనదై నిలుపుకున్న అమరావతి.. అహర్నిశం.. అరమరికల్లేని..చంద్రబాబు శ్రమనుజూచి.. మురిసెనే..మన తెలుగోడి గుండె...

మన అమరావతి

మన అమరావతి ఆంధ్ర దేశాన ..కృష్ణానదికి.. కుడివైపునా.. శతాబ్ధాల చరితగా..శోభితంగా సాగిందే.. అమరావతి దివ్యక్షేత్రమై...తెలుగోని గర్వమై.. సకల విద్యలకాలవాలమై..కీర్తిగాంచిందే.. దేశ-దేశాలకు జ్ఞాన-విజ్ఞానాన్ని..పంచిందే.. బౌద్ధ,హిందూ ధర్మతేజమై..నిక్కంగా నిలచిందే.. అబ్బురపడని యాత్రికులెవ్వరు..అమరావతి సొబగులకు.. మెచ్చిపోషించని పాలకులెవ్వరు..మెండైన శిల్పాలు.. భారతీయ శిల్ప కళాన్యాసమై..భవ్యత నొందిందే... చంద్రుని శివలింగము ప్రతిష్టింప.. ధరణికోట ధన్యమై... దీపాల దిన్నెగా..వాసికెక్కి..వెలుగులు వెదజల్లిందే.. కథలు-కథలుగా.. వేనోళ్ల కోనియాడబడినదే... అడ్డగోలు విభజనతో...అలజడిలో పడిపోయిన ఆంధ్రావని.. చంద్రబాబు నిర్ణయంతో..ఆంధ్రప్రదేశ్ రాజధానియై... రాజసములొలుకుచూ..పునర్వైభవము కోరుతూ.. నిలచిందే అమరావతి...మన అందరి సౌభాగ్యమై... నేనొకనిటుకనంటూ..సహృదయం ఎలుగెత్తుచుండ.. ఊరువాడ తరలిరాగా..మన్ను-తీర్థ జలాలు తనుజేర.. ఘనంగా ప్రారంభవుతూ...మురిసిపోయె మన అమరావతి..

ఎన్ని ఆశలో...తెలుగువారి మదినిండా...

ఎన్ని ఆశలో...తెలుగువారి మదినిండా... చంద్రశేఖరుని.. దివ్యతలంపుగా.. ఆంధ్రదేశాన..విజయదశమి పర్వదినాన.. కృష్ణమ్మ చెంతన..ఉద్ధండరాయుని పాలెంలోన.. పచ్చని తోరణాలతో..పసందైన వంటకాలతో... బుద్ధుని కనుసన్నల్లో...కనకదుర్గమ్మ ఆశీస్సులతో.. అమరావతి..మనరాజధానియని..మురుస్తూ.. ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా.. ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో.. దేశ-దేశాల పాలకులు...శ్రీమంతులు తరలిరాగా... వన్నెలొలుకుచూ..వయ్యారాలు వొలకబోస్తూ.. అఖండమై..అద్వితీయమై..నిలచిందే అమరావతి.. ప్రపంచ స్థాయి నగరానికై..తొలియడుగేసిందే.. పర్యాటక నగరానికై...ఉరకలు వేస్తుందే... మన అపురూప అమరావతి..శిలాన్యాసానికై... ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా.. ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో.. చరిత్రపుటలన్నీ..మదినిండా..తిరుగాడుతున్నాయే... గతాన్ని తిరగరాయాలని..తనలో తలంపు జరిగిందే... చేతిన చిల్లిగవ్వలేదు...తొణకలేదు తనలో రాజసం.. ధైర్యమే పెట్టుబడిగా...పరువుకోసమడుగేస్తూ.. ప్రతిష్ఠకై నిలబడుతూ..తనశైలి నిలుపుకొంటూ.. నరనరాల్లోని శక్తినంతా..కూడదీసుకుంటూ.. అబ్బురంగా నిలచిందే మన తెలుగువారి తేజమే.. ఎ