మన అమరావతి



మన అమరావతి

ఆంధ్ర దేశాన ..కృష్ణానదికి.. కుడివైపునా..
శతాబ్ధాల చరితగా..శోభితంగా సాగిందే..
అమరావతి దివ్యక్షేత్రమై...తెలుగోని గర్వమై..
సకల విద్యలకాలవాలమై..కీర్తిగాంచిందే..
దేశ-దేశాలకు జ్ఞాన-విజ్ఞానాన్ని..పంచిందే..
బౌద్ధ,హిందూ ధర్మతేజమై..నిక్కంగా నిలచిందే..

అబ్బురపడని యాత్రికులెవ్వరు..అమరావతి సొబగులకు..
మెచ్చిపోషించని పాలకులెవ్వరు..మెండైన శిల్పాలు..
భారతీయ శిల్ప కళాన్యాసమై..భవ్యత నొందిందే...
చంద్రుని శివలింగము ప్రతిష్టింప.. ధరణికోట ధన్యమై...
దీపాల దిన్నెగా..వాసికెక్కి..వెలుగులు వెదజల్లిందే..
కథలు-కథలుగా.. వేనోళ్ల కోనియాడబడినదే...

అడ్డగోలు విభజనతో...అలజడిలో పడిపోయిన ఆంధ్రావని..
చంద్రబాబు నిర్ణయంతో..ఆంధ్రప్రదేశ్ రాజధానియై...
రాజసములొలుకుచూ..పునర్వైభవము కోరుతూ..
నిలచిందే అమరావతి...మన అందరి సౌభాగ్యమై...
నేనొకనిటుకనంటూ..సహృదయం ఎలుగెత్తుచుండ..
ఊరువాడ తరలిరాగా..మన్ను-తీర్థ జలాలు తనుజేర..
ఘనంగా ప్రారంభవుతూ...మురిసిపోయె మన అమరావతి..

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?