మన అమరావతి.. మన సంస్కృతి.



మన అమరావతి.. మన సంస్కృతి.
ఏమున్నతి అంధ్రప్రదేశ్ చెంతన...
లోటు బడ్జెట్ తో.. పేదరికాన..
మట్టిని-నీటిని నమ్ముకుని..
ధైర్యమే పెట్టుబడిగా...
సాహసమే తన ఊపిరిగా
సంకల్పమే బలంగా..
వడి -వడిగా.. అడుగులేస్తూ..
నూతన రాజధానిగా..
అంకురార్పణ చేసుకుందే...
మన అమరావతి...
రైతన్న త్యాగం.. ఆదర్శమయిందే..
అన్నంబెట్టే అన్నపూర్ణను..
అమరావతికి రూపమవ్వగా..
పులకించెనే దేవతలు సైతము..
ఎన్నో ఆశలు-ఆశయాలు..
రైతన్న కళ్లల్లో కనబడుతుంటే..
నావంతు కర్తవ్యమంటూ..
నడిచిందే ఆంధ్ర దేశమంతా..
సంప్రదాయాలకి.. మారుపేరుగా..
సాటెవ్వరనిపించిందా.. దివ్యభూమి..
పేదరికాన్ని పేగున కట్టేసుకుని..
ఆథిత్యమిచ్చిందా.. మనతెలుగు జాతి..
భారత దేశానికే గర్వమై.. ధాన్యగారమై..
నిలచిందే.. ఘనంగా...చరిత్రలోన..
దేశానికే తలమానికమై..
ప్రపంచానికే వెలుగైన ఒకనాటి చరిత..
కొనియాడబడిందే... మన జన్మభూమి..
చేయి-చేయి కలుపుకుంటూ.. నడవంగా
సామాన్యుడూ.. భాగమై నిలవంగా..
శక్తిలో.. యుక్తిలో... భక్తిలో..
కొదవేది తెలుగు జాతిలోన..
సాధించలేనిదేముంది.. ఇలలోన..
విశ్వమే.. అచ్చెరువొందదా...
మన సంకల్ప బలముజూడంగా..

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?