రాజస్థాన్.. రాజ్యమా..

రాజస్థాన్.. రాజ్యమా.. 

రాజస్థాన్.. రాజ్యమా..
రాచరికపు ఉన్మాదమా..
మనిషిని మనిషిగా...
చూడలేకున్నావెందుకు..!
ఒకటా.. రెండా..
రోజుకోచోట ఏదో ఓ రూపంలో..
దళితులపై దమన కాండలెందుకో..
కఠినమై.. కర్కశమై..
మానవత్వం మరచిపోయి...
హింసలేమిటో.. నీ ధర్మమేమిటో...
సభ్య సమాజం.. ఈసడించుకొనేలా..
ఆకృత్యాలేమిటో.. 

మన నేల అహింసకు ఆనవాళ్లు..
సత్యానికి.. ధర్మానికి..
కీర్తి పతాకం..
బుధ్ధుని ఆదర్శమై.. అశోక ధర్మ చక్రమై...
మహోన్నత సమతావాద దేశమై..
ప్రపంచాన ఘన చరిత తనపేర
శాశ్వతంగా నిలుపుకొన్నదే...
కులమేంది.. మతమేంది..
మనమంతా మనుష్యులం..
కోతి నుంచే మనిషి మనుగడ కాదా..
వర్ణం కాదు.. వర్గం కాదు..
కలిసి బతకడం కావాలి..
శ్రమించే దెవరైనా..
చెయ్యెత్తి జైకొట్టాలే...
మంచికై.. లోకం మెచ్చేలా..
భరతమాత మురిసేలా...
మన మనుగడుండాలె..

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?