ఎన్ని ఆశలో...తెలుగువారి మదినిండా...



ఎన్ని ఆశలో...తెలుగువారి మదినిండా...

చంద్రశేఖరుని.. దివ్యతలంపుగా..
ఆంధ్రదేశాన..విజయదశమి పర్వదినాన..
కృష్ణమ్మ చెంతన..ఉద్ధండరాయుని పాలెంలోన..
పచ్చని తోరణాలతో..పసందైన వంటకాలతో...
బుద్ధుని కనుసన్నల్లో...కనకదుర్గమ్మ ఆశీస్సులతో..
అమరావతి..మనరాజధానియని..మురుస్తూ..
ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా..
ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో..

దేశ-దేశాల పాలకులు...శ్రీమంతులు తరలిరాగా...
వన్నెలొలుకుచూ..వయ్యారాలు వొలకబోస్తూ..
అఖండమై..అద్వితీయమై..నిలచిందే అమరావతి..
ప్రపంచ స్థాయి నగరానికై..తొలియడుగేసిందే..
పర్యాటక నగరానికై...ఉరకలు వేస్తుందే...
మన అపురూప అమరావతి..శిలాన్యాసానికై...
ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా..
ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో..




చరిత్రపుటలన్నీ..మదినిండా..తిరుగాడుతున్నాయే...
గతాన్ని తిరగరాయాలని..తనలో తలంపు జరిగిందే...
చేతిన చిల్లిగవ్వలేదు...తొణకలేదు తనలో రాజసం..
ధైర్యమే పెట్టుబడిగా...పరువుకోసమడుగేస్తూ..
ప్రతిష్ఠకై నిలబడుతూ..తనశైలి నిలుపుకొంటూ..
నరనరాల్లోని శక్తినంతా..కూడదీసుకుంటూ..
అబ్బురంగా నిలచిందే మన తెలుగువారి తేజమే..
ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా..
ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో..

చేయూతకోరి నిలచిందే..చేవచూడమంటున్నదే..
సామాన్యుని సైతం..సాయమాశించిందే..
రైతులు-శ్రామికులెల్ల..ఊపిరై నిలబడగా..
పేదరికాన మ్రగ్గినా...పెద్దరికం చూపుతోంది..
ముక్కున వేలేసుకొనిరా...చూసినవారెల్లరూ..
ఎన్ని ఆశలో..తెలుగువారి గుండెనిండా..
ఎన్నెన్ని కలలో...మదిన గలగలలాడేనో..


Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?