మురిసెనే ..మన తెలుగోడి గుండె...



మురిసెనే ..మన తెలుగోడి గుండె...

నగర శోభను సంతరించుకుంటూ...
చిన్నివన్నెలొలుకుచూ..కళ-కళలాడుచూ ..
కవులు..పండితుల..  దివ్యారాధనలో.. 
నవ్యాంధ్ర.. తేజో దీప్తిపుంజమై...
అలరారు ..అమరావతి సొబగులుజూడ..
మురిసెనే..మన తెలుగోడి గుండె...

పుణ్యంగా పుట్టమన్ను..పవిత్రంగా కలశాలు..
తెలుగువారి ఐక్యతగా ..తరలివచ్చెనే..
ఊరువాడ-పిల్లజెల్ల..సందడి జేయంగా..
తెలుగునాట సంబరం..అంబరాన్నంటుచుండ...
మురిసెనే..మన తెలుగోడి గుండె...

ఇంద్రుడు-చంద్రుడు..  దేశ-దేశాల పాలకులెందరో..
అమరావతిని మనసారా..దీవించరాగా...
తెలుగుప్రదేశాన పండుగై..పర్వదినమైన వేళ..
పవిత్రమై.. పరిడవిల్లుచున్న..మనరాజధానిజూడగా..
మురిసెనే..మన తెలుగోడి గుండె...

బుద్ధుని ఆశీస్సులు చల్లంగా తాకుచుండ...
కనకదుర్గ ..కమనీయ కాంతులీనువేళ..
నవ్యమై..భవ్యమై..అమరావతి అజరామమై..
చరిత్రలో మరోపేజీ..తనదై నిలుపుకున్న అమరావతి..
అహర్నిశం.. అరమరికల్లేని..చంద్రబాబు శ్రమనుజూచి..
మురిసెనే..మన తెలుగోడి గుండె...

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?