Posts

क्या मालूम है... इन बच्चों को !

क्या मालूम है... इन बच्चों को ! क्या मालूम है... इन बच्चों को ! धर्म -कर्म , जाति -मर्म.. वर्ण-वर्ग , वित्त-सत्ता.. क्या फरक जानते ? कुटिल -कुत्सित तंत्र.. राजरिक-सांसारिक.. भेद-विभेद , मालूम है क्या ? चींटी से डरते , माँ के कोख से लपेट रहते.. असत्य न कहते , कठोर वचन न बोलते.. सच्चे प्यार के हैं अधिकारी ममता के । जिंदा जलाया कैसे रे ! क्या अपमान किये , कौनसी धोखा दिये ? ये पराये समझे हो ? हमारे भावी पीढी हैं , भारत माता के सुपूत हैं । बरबाद किया कैसे ? रे मृगजाती ! ? पढ़ते हो ! धर्म ग्रंथ कितने पंडित होकर ..! मानवता सीखना भूल गया रे ! भगवान का दर्शन किया कहाँ रे !!

మన తెలుగు జాతి..

మన తెలుగు జాతి.. అంగరంగ వైభవంగా... ఆతిథులంతా తరలి రాగా.. అఖండ తేజమై... అమరావతి కళకళలాడగా.. ఊరువాడ ఏకమై.. దశహరా దరువై ఆటాపాటలతో.. చమత్కార మాటలతో.. అన్ని మతాల సమన్వయమై.. మానవత్వమయ్యిందే.. ఆద్యంతమానందమై... ఓలలాడిందే మన తెలుగుజాతి.. వెన్నంటే వెలితి.. వెటకారంగా ఎక్కిరిస్తున్నా.. తెలుగు జాతి తేటదనాన్ని.. కనువిందు చేసిందే.. చంద్రుని చలువవెన్నెలలా.. ఘనమైన ఆతిథ్యమిచ్చిందే.. ఆశల భారమెంత బరువైనా.. గుండె దిటవున నిలబడుతూ.. సంస్కృతి.. సంప్రదాయాలకే.. పెద్దపీట వేసుకుంటూ.. ఆద్యంతమానందమై.. ఓలలాడిందే మన తెలుగుజాతి.. పెద్దలకు పేదరికమెచ్చటా.. కంట కనపడలేదేమో.. మన బాధలు మనరోధలు.. మూగభాషలయ్యాయే.. ఆతిథ్యాన అడగలేక.. సంస్కారంలో ఒదిగిపోయిందే.. మన పెద్దమనసు.. పాలు పోక చిన్నబోయిందే.. ఆంధ్రనాడు కలిసికట్టు జట్టై.. నడుం గట్టి నడవగా.. నేను సైతమంటూ నిలబడితే..స్వార్థ చింతన వదిలేస్తే... సాధించలేనిదేమిటీ... కొండను పిండైనా చేయలేమా... మన శక్తి మనయుక్తి.. కొదవలేదు గుండె తడిమి చూడు.. దేశదేశాలెల్ల లెస్సగా.. కొనియాడిందే మన తెలుగు జాతి..

మన అమరావతి.. మన సంస్కృతి.

మన అమరావతి.. మన సంస్కృతి. ఏమున్నతి అంధ్రప్రదేశ్ చెంతన... లోటు బడ్జెట్ తో.. పేదరికాన.. మట్టిని-నీటిని నమ్ముకుని.. ధైర్యమే పెట్టుబడిగా... సాహసమే తన ఊపిరిగా సంకల్పమే బలంగా.. వడి -వడిగా.. అడుగులేస్తూ.. నూతన రాజధానిగా.. అంకురార్పణ చేసుకుందే... మన అమరావతి... రైతన్న త్యాగం.. ఆదర్శమయిందే.. అన్నంబెట్టే అన్నపూర్ణను.. అమరావతికి రూపమవ్వగా.. పులకించెనే దేవతలు సైతము.. ఎన్నో ఆశలు-ఆశయాలు.. రైతన్న కళ్లల్లో కనబడుతుంటే.. నావంతు కర్తవ్యమంటూ.. నడిచిందే ఆంధ్ర దేశమంతా.. సంప్రదాయాలకి.. మారుపేరుగా.. సాటెవ్వరనిపించిందా.. దివ్యభూమి.. పేదరికాన్ని పేగున కట్టేసుకుని.. ఆథిత్యమిచ్చిందా.. మనతెలుగు జాతి.. భారత దేశానికే గర్వమై.. ధాన్యగారమై.. నిలచిందే.. ఘనంగా...చరిత్రలోన.. దేశానికే తలమానికమై.. ప్రపంచానికే వెలుగైన ఒకనాటి చరిత.. కొనియాడబడిందే... మన జన్మభూమి.. చేయి-చేయి కలుపుకుంటూ.. నడవంగా సామాన్యుడూ.. భాగమై నిలవంగా.. శక్తిలో.. యుక్తిలో... భక్తిలో.. కొదవేది తెలుగు జాతిలోన.. సాధించలేనిదేముంది.. ఇలలోన.. విశ్వమే.. అచ్చెరువొందదా... మన సంకల్ప బలముజూడంగా..

రాజస్థాన్.. రాజ్యమా..

రాజస్థాన్.. రాజ్యమా..  రాజస్థాన్.. రాజ్యమా.. రాచరికపు ఉన్మాదమా.. మనిషిని మనిషిగా... చూడలేకున్నావెందుకు..! ఒకటా.. రెండా.. రోజుకోచోట ఏదో ఓ రూపంలో.. దళితులపై దమన కాండలెందుకో.. కఠినమై.. కర్కశమై.. మానవత్వం మరచిపోయి... హింసలేమిటో.. నీ ధర్మమేమిటో... సభ్య సమాజం.. ఈసడించుకొనేలా.. ఆకృత్యాలేమిటో..  మన నేల అహింసకు ఆనవాళ్లు.. సత్యానికి.. ధర్మానికి.. కీర్తి పతాకం.. బుధ్ధుని ఆదర్శమై.. అశోక ధర్మ చక్రమై... మహోన్నత సమతావాద దేశమై.. ప్రపంచాన ఘన చరిత తనపేర శాశ్వతంగా నిలుపుకొన్నదే... కులమేంది.. మతమేంది.. మనమంతా మనుష్యులం.. కోతి నుంచే మనిషి మనుగడ కాదా.. వర్ణం కాదు.. వర్గం కాదు.. కలిసి బతకడం కావాలి.. శ్రమించే దెవరైనా.. చెయ్యెత్తి జైకొట్టాలే... మంచికై.. లోకం మెచ్చేలా.. భరతమాత మురిసేలా... మన మనుగడుండాలె..

మురిసెనే ..మన తెలుగోడి గుండె...

మురిసెనే ..మన తెలుగోడి గుండె... నగర శోభను సంతరించుకుంటూ... చిన్నివన్నెలొలుకుచూ..కళ-కళలాడుచూ .. కవులు..పండితుల..   దివ్యారాధనలో..   నవ్యాంధ్ర.. తేజో దీప్తిపుంజమై... అలరారు ..అమరావతి సొబగులుజూడ.. మురిసెనే..మన తెలుగోడి గుండె... పుణ్యంగా పుట్టమన్ను..పవిత్రంగా కలశాలు.. తెలుగువారి ఐక్యతగా ..తరలివచ్చెనే.. ఊరువాడ-పిల్లజెల్ల..సందడి జేయంగా.. తెలుగునాట సంబరం..అంబరాన్నంటుచుండ... మురిసెనే..మన తెలుగోడి గుండె... ఇంద్రుడు-చంద్రుడు..   దేశ-దేశాల పాలకులెందరో.. అమరావతిని మనసారా..దీవించరాగా... తెలుగుప్రదేశాన పండుగై..పర్వదినమైన వేళ.. పవిత్రమై.. పరిడవిల్లుచున్న..మనరాజధానిజూడగా.. మురిసెనే..మన తెలుగోడి గుండె... బుద్ధుని ఆశీస్సులు చల్లంగా తాకుచుండ... కనకదుర్గ ..కమనీయ కాంతులీనువేళ.. నవ్యమై..భవ్యమై..అమరావతి అజరామమై.. చరిత్రలో మరోపేజీ..తనదై నిలుపుకున్న అమరావతి.. అహర్నిశం.. అరమరికల్లేని..చంద్రబాబు శ్రమనుజూచి.. మురిసెనే..మన తెలుగోడి గుండె...