మన తెలుగు జాతి..



మన తెలుగు జాతి..
అంగరంగ వైభవంగా... ఆతిథులంతా తరలి రాగా..
అఖండ తేజమై... అమరావతి కళకళలాడగా..
ఊరువాడ ఏకమై.. దశహరా దరువై
ఆటాపాటలతో.. చమత్కార మాటలతో..
అన్ని మతాల సమన్వయమై.. మానవత్వమయ్యిందే..
ఆద్యంతమానందమై... ఓలలాడిందే మన తెలుగుజాతి..
వెన్నంటే వెలితి.. వెటకారంగా ఎక్కిరిస్తున్నా..
తెలుగు జాతి తేటదనాన్ని.. కనువిందు చేసిందే..
చంద్రుని చలువవెన్నెలలా.. ఘనమైన ఆతిథ్యమిచ్చిందే..
ఆశల భారమెంత బరువైనా.. గుండె దిటవున నిలబడుతూ..
సంస్కృతి.. సంప్రదాయాలకే.. పెద్దపీట వేసుకుంటూ..
ఆద్యంతమానందమై.. ఓలలాడిందే మన తెలుగుజాతి..
పెద్దలకు పేదరికమెచ్చటా.. కంట కనపడలేదేమో..
మన బాధలు మనరోధలు.. మూగభాషలయ్యాయే..
ఆతిథ్యాన అడగలేక.. సంస్కారంలో ఒదిగిపోయిందే..
మన పెద్దమనసు.. పాలు పోక చిన్నబోయిందే..
ఆంధ్రనాడు కలిసికట్టు జట్టై.. నడుం గట్టి నడవగా..
నేను సైతమంటూ నిలబడితే..స్వార్థ చింతన వదిలేస్తే...
సాధించలేనిదేమిటీ... కొండను పిండైనా చేయలేమా...
మన శక్తి మనయుక్తి.. కొదవలేదు గుండె తడిమి చూడు..
దేశదేశాలెల్ల లెస్సగా.. కొనియాడిందే మన తెలుగు జాతి..

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?