Posts

समानता

ये नहीं जानते  समानता का अर्थ अपनी भूख मिटाने की रोजी - रोटी की तलाश है धूप - छाह भूलकर सुबह से शाम तक अपने पेट को दबाते अश्रुजल में डूबते  पसीने में भीगते दुःख - दर्द, पीड़ा - व्यथा में अपनी - अपनी दौड़ है। कभी नहीं मानेंगे वे समता - ममता, भाईचारा इंसानियत की गरिमा  वर्ण, वर्ग, नस्ल को फैलाते जाति - धर्म को ही श्रेष्ठ मानते  सालों का यह छल - कपट हर जगह जारी है दूसरे करतूत को अपने पल्ले में लेते आराम की छाया में मशगूल होते इनकी अपनी दर्जा है। हम अक्षरवाले, स्याही के अधिकारी सत्पथ के ईज़ाद के जिम्मेदार हैं समतल के चिंतन में  वैश्विक चेतना का चेहरा हर कोपलें में भर दें रंग - बिरंगे उपवन में सहकारिता की हरियाली भर दें सामूहिक तत्व में स्वार्थ का चिंतन भस्म करा दें भोग को, रोग को मिटाने का ईजाद दें।

అమ్మ నడచిన దారి.....

అమ్మ నడచిన దారి.....                     ఈ రోజు మాతృ దినోత్సవం. మనసు కాలాలు దాటుకుని వెళ్లి అమ్మను చూస్తోంది. బాల్యంలోకలా... స్మృతి పథంలోకి అడుగులేసుకుంటూ నడచి పోతోంది. .. “ఒరేయ్..చిన్నోడా..! మీ అమ్మ ఇందాక మొగసాల్లోనే కూసోని నీ కోసం చూసి-చూసి పనికి పోయిందిరా..” రాములత్త మాటల్నలా నేను గ్రద్ధ కోడిపిల్లను అమాంతం గాల్లోకి తన్నుకు పోయినట్లు నా చెవుల్లో వేసుకుని రయ్ మని పరుగు తీస్తూ ఇంటి గడప దగ్గరాగాను. పిల్ల చేష్టలు. నేను నిలకడగా నిలచిందెక్కడా.. రెక్కలు కట్టుకోని అలా పరుగులెట్టడమే గదా. అమ్మ ఇంటికి తాళం వేయలేదు. ఊరికే గడికి తాళం తగిలించి పోయింది. హమ్మయ్యా.. ! గడి తీసి తలుపు తోసుకుంటూ లోపలికెళ్లాను. బాగా ఆకలిగా ఉంది. పొయ్యికి కొంచెం ఎత్తులో ఉట్టి ఉంది. ఉట్టి మీద దబరుంది. ఆ ఉట్టి ఎప్పటిదో..! నాకు తెలియదు. సచ్చు తంతితో దాన్నల్లారు. అది మా తాతల కాలం నుండి ఉందని మా అమ్మ అంటూ ఉంటుంది. పొయ్యి పైకెక్కి దబరందుకుని చూస్తే అందులో రాగి సంగటి ముద్దుంది. అందులోకి కాల్చిన మిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, చింతపండుతో చేసిన కారముంది. సంగట్లోకి ఆ కారమంటే నాకు భలే ఇష్టం. ముద్ద పెట్టుక

పుడమి తల్లి దాహం తీరింది

పుడమి తల్లి దాహం తీరింది పుడమి తల్లి దాహం తీరింది జీవరాశి చల్లని శ్వాస తీసుకుంటోంది రైతన్న ఆశల సౌధం నిలచింది నిరాశల సెగలు నేల కూలాయి పచ్చటి సామ్రాజ్యానికి పలుగు పడింది రాజు గుండెలో ఉత్సాహం ఉరకలేస్తోంది కోయిల సెలయేటి పాట కమ్మగా వినిపిస్తోంది జంతుజాలంలో జీవం అడుగులేస్తోంది చెట్టు -చేమలో చిరునవ్వు చిందేస్తోంది క్రిమి-కీటకాదులు కిచకిచలాడుతున్నాయి దశాబ్దంగా దాగిన మూగ మనసు మాట కలుపుతోంది

జీవితానికి ఎన్ని గిరులు...

జీవితానికి ఎన్ని గిరులు... జీవితానికి ఎన్ని గిరులు... కులం-మతం , వర్ణం-వర్గం , సంప్రదాయాలు , కట్టుబాట్లు , ఆస్థి పాస్తులు , ఎన్నో అహంభావాలు ఇవన్నీ దాటేదెప్పుడు!! మనిషి పాషాణ హృదయం నుండి మానవత్వాన్ని చేరేదెప్పుడు!! మానవత్వాన్ని దాటి దైవాన్ని చేరేదేజన్మకు!! మనిషి జంతవుపై గెలవొచ్చు.. తన పెంపుడుగా మార్చుకోవచ్చు.. మనిషి మనిషిపై ఆధిపత్యం సాధించవచ్చు.. బానిసగా చూడవచ్చు.. అదే గెలుపు గొప్పనుకుంటే... ఇంతకంటే అవివేకమేముంది ? ప్రకృతిపై గెలవడం తనవల్ల అయిందా..!! మరి. .! ఎందుకు పుట్టాడో .. తను తెలుసుకునేదెప్పుడు.. ? కుళ్లు తంత్రాల గుప్పిట్లో... తాను మహారాజు అనిపించుకోవడం .. ఏ పాటి.. ? జననం -మరణం మధ్యలో తన ఆట సంతు -తంతు గుట్టులో తన ఆటలేమవుతాయో. . ? భోగ -భాగ్యం ..తనల్లుకొన్న సాలెగూడ్లు.. తరువాత ఏమవుతాయో.. ? జంతువు మనిషిగా మారినా ... ప్రగతియనే పేరే గానీ.. తన గుణమెక్కడ పోయింది ?

గుడారాల జీవితాలు..

గుడారాల జీవితాలు.. శ్రమకు ప్రతి రూపాలు. ఎండా-వాన , చలి-గిలి , మట్టి -బురదా , అన్నీ ఒకటై నడిచే బతుకులు. జీవతానికే అర్థమై .. కనుల ముందు నిలచి ఎన్నో భవనాలకి రూపమిచ్చి ఎందరి సుఖాలకో శ్రమను ధారవోసి వాటికి దూరంగా నిలచిన మన పేదవాని జీవిత సత్యాలు. కూలి దొరకలేదు..పొయ్యి మండలేదు నిలువ జాగాలేదు..బతుకు బండి నిలువలేదు ప్రేగులు వీపున కట్టుకుని నడుస్తుంటే ... జీవిత పోరాటంలో .. గెలుపు బావుటా ఎగురవేస్తూ.. సాగుతున్న మన అభాగ్యపు జీవితాలు.