పుడమి తల్లి దాహం తీరింది


పుడమి తల్లి దాహం తీరింది

పుడమి తల్లి దాహం తీరింది
జీవరాశి చల్లని శ్వాస తీసుకుంటోంది

రైతన్న ఆశల సౌధం నిలచింది
నిరాశల సెగలు నేల కూలాయి
పచ్చటి సామ్రాజ్యానికి పలుగు పడింది
రాజు గుండెలో ఉత్సాహం ఉరకలేస్తోంది
కోయిల సెలయేటి పాట కమ్మగా వినిపిస్తోంది
జంతుజాలంలో జీవం అడుగులేస్తోంది
చెట్టు -చేమలో చిరునవ్వు చిందేస్తోంది
క్రిమి-కీటకాదులు కిచకిచలాడుతున్నాయి
దశాబ్దంగా దాగిన మూగ మనసు మాట కలుపుతోంది

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....