మనం... మన మతం

మనం... మన మతం

మతమంటే ఏమిటో ...జాతియంటే..తెలియకుండానే మనమూ గుడ్డిగానే పరిగెడుతున్నామా..మత భేదం లేక సర్వ మానవాళికి స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించిన హిందూ దేశంలో మత మౌఢ్యాన్ని సృష్ఠంచిందెవరు...విభిన్నమైన పద్దతుల్లో సాధనా పరులై స్త్రీలను,శ్రామికులను రైతులను అగ్ర భాగాన నిల్పి సర్వ మానవ సౌభ్రాతృత్వంతో దేశ-దేశాలలో కీర్తి గడించిన ఈ ఉపఖండం పునర్వైభవాన్ని పొందడానికి సమసమాజాన్ని సాధించడానికి కృషి సల్పడం పుణ్య భూమిలో జన్మించిన ప్రతి ఒక్కరి కర్తవ్యం.దీనికై ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి...వాస్తవాల్ని వెలికితీయాలి.స్వంత మేలు కొంత మానుకొని పొరుగువానికి సాయపడమనే వాక్యాల్ని నెమరేసుకుంటూ ముందుకు నడవాలి.
భగవద్గీతను జాతీయ గ్రంథంగా గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తర భారతంలో వాడి వేడి చర్చ మెుదలయింది.ప్రముఖ దళిత కవి,రచయుత కన్వల్ భారతి గారు ఆక్షేపిస్తూ భగవద్గీతలోని కొన్ని అంశాలు లేవదీశారు.

మాంహి పార్థ ! వ్యపాశ్రిత్యయే పిస్తు పాప యోనయ:I
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాపియాన్తి పరాం గతిమ్II

తా  .పాప జన్మము కలవారైన స్త్రీలు,వైశ్యులు,శూద్రులు మెుదలైన వారందరు నన్ను     శరణు పొందిన యెడల సర్వోత్తమమగు మోక్షమును పొందుదురన్న శ్లోకం ఎంతో వివాదస్పదమై ఉంది.
స్త్రీకిచ్చిన విలువపై ఎందరో స్త్రీల మండిపాటుకు గురియౌతోంది. పాప యోనిగా పేర్కొనడం బాధాకరమే కాదు అవమానకరం.భారత దేశంలో గీత ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న అది స్వార్థ భావాల పక్షానే నిలబడి పోయింది.
మన బహు మత జాతులున్న దేశంలో శూద్రులను,స్త్రీలను వైశ్యులను కించపరిచే,దేశ సార్వభౌమత్వం,సౌభ్రాతృత్వానికి భంగం కలిగే గీతని మానవ పుట్టుకని జీవితాల్ని అధ్యయనం చేసే నేటి యుగానికి తగదమో. గుడ్డిగా ఏదేనిని సమర్థించడం వైజ్ఞానిక యుగంలో పరిగెడుతుా మానవత్వపు బాటలో పయనించే మన సభ్య సమాజానికి ఉపయోగకారి కాదేమో.. ఇంకనూ అజ్ఞాన కూపాన్ని ఛేదించలేదనే చెప్పవచ్చు.  తరాలు మారినా ఇంకనూ మూఢభావాలతో స్వార్థపు గూటికి చేరిపోయి బాధలను భరించడం కాకూడదు.
మతమంటే అభిప్రాయమే.ఒక కాలం నాటి అభిప్రాయాలు మరో కాలానికి సరికావు.లేకుంటే ఇన్ని మతాలు పుట్టేవి కావు.నిజమైనది సత్యమైనది ఎప్పటికీ మారదు.మారేదేది నిజం కాదు.కొందరికి మోదం ఇంకొందరికి ఖేదం కలిగించేది..ఎప్పటికీ మంచి వాక్యం కానేరదు.వర్ణం,మతం ,కులం పేరిట సాటి మలుష్యులను అభాగ్యులను చేసి సేవలు చేయించుకోవడం బుద్ధి బలంగా చెప్పుకొంటే అది పొరపాటే.భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుకొంటూ మనిషిని మనిషిగా చూడలేని ధర్మమేమి ధర్మమౌతుంది....స్వార్థం మోసం గాక. ఇంకొకరి శ్రమ మీద సుఖ భోగాలను అనుభవించే కుటిల నీతిని ఇంకనూ సమర్థించాలా..వేలాది సంవత్సరాలు చదువుకు నోచుకోని జీవితాలు..మనవి.  శ్రమయేవ జయతే ..సత్యమేవ జయతే అని చప్పుకొనెే మన దేశంలో పాటించడంలో ఎంత వెనుకబడిపోయామో.అందరూ చదువుకుంటున్న నేపథ్యంలో వర్ణం,కులం,మతం పుట్టుకల్ని ఛేదించలేమా.. నవ సమాజాన్ని నిర్మించుకోలేమా..సర్వమానవ సౌభ్రాతృత్వంతో ముందడుగు వేయలేమా...మన మధ్య వేలాది సంవత్సరాలుగా వేళ్లూనికిని ఉన్న కుల,మత,వర్ణాంతరాల్ని చెరిపేయలేమా..
మనిషిగా..మానవతా సమాజాన్ని నిర్మించుకోలేమా...చేయి-చేయి కలుపుకొని,సుఖ దుఖాల్ని పంచుకుంటూ నిజమైన దైవత్వంతో జీవించలేమా..మతమంటే మనుగడ-
 మానవత్వం.ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ అన్ని పనులు ఒక్కరే చేసుకుని జీవించడం కల్పన కూడా చేయలేము.అలాంటి ఇక్కడ ఎవ్వరు గొప్ప..ఎవరు తక్కువ. కుల్లినవి గంజు తీసేవారు లేకపోతే రోగాలతో చావడం ఖాయం..దేశ రక్షణ చేసే సైనికుడు లేకపోతే కంటిమీద కునుకేది.సద్దియన్నం తిని మనకు రకరకాల రుచికర పదార్థాలనందించే రైతే లేకపోతే మన మనుగడేది.నిజమైన దేవుడు మనిషి రూపంలో ఇలా కనిపిస్తున్న..నీచంగా చూస్తూ ..రాతిలో దైవాన్ని దర్శించడం..మనకు నిజమైన ధర్మమేనా..భోజనం అనుకుంటూ తింటామే..అందులో ఎంతమంది జనం ఉన్నారో..తలచుకోను కూడా తలచుకోం.(భో:శక్తి ,జనం: మనుష్యులు) మన ప్రతి వస్తువు లో ఎందరి సహకారముందో..తలతో నడుస్తూ మనకున్న తోకల్ని చూసి మురిసిపోతున్నాం.వేమన,పోతులూరి,అన్నమయ్య,రామదాసు కబీర్ గౌతమ బుద్ధ,అంబేద్కర్,గాంధీజీ......... మహనీయులెందరో మనలోని వైషమ్యాల్ని రూపుమాపడానికి ప్రయత్నించారో...కానీ స్వార్థపు కోరల్లో చిక్కిన మన సమాజం విముక్తమై మన మానవతా మతం వికసించాలని ఆశిస్తూ ..లోకా సమస్తా సుఖినో భవంతు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?