మన గోదావరి



                                 మన గోదావరి                 రచన : పైడాల రవీంద్ర నాథ్.
నాసికయందు జననమై..
భారతావనికి ముద్దు బిడ్డవై...
దివ్యకీర్తిని దాల్చిన ..మనోహరి మన గోదావరి.
పురాణేతిహాసాలలో ...
తన స్థానము నిలుపుకొని..
ఎందరో కవుల చేత ..కొనియాడబడుచున్న..
ఘనపాటి మన గోదావరి.
నూతన వధూవరులనాశీర్వదిస్తూ...
మన సంస్కృతి పరంపరలో.. మన జీవన పథంలో..
ముడిపడి ఒలరారుచున్న ..
మహోన్నతి మన గోదావరి.
గౌతమ మహర్షి తపో సంపన్నతగా...
లోకక్షేమమందినట్టి..సకలజీవికాధారమైనట్టి..
నిరంతర వాహిని ..మన గోదావరి.
ఏడుపాయలుగా మారి ..సప్తర్షుల తేజమై..
సప్తలోకాల దివ్యానందమై..మానవాళి చెంతచేరిన..
జీవనాద వినోదిని ..మన గోదావరి.
తెలుగువెలుగై..భక్తి తత్వమై...
అందరి గుండెల్లో ..ఆహ్లాదమై..
ఆత్మానందమై...పుష్కర శోభయైన..
పుణ్యమూర్తి ..మన గోదావరి.
దేశానికే అన్నపూర్ణగా...
తెలుగు ప్రదేశాన్ని నిలుపుటలో...
తనదైన పాత్ర నొందినట్టిదే..
మన పొగడ్త ఏపాటిదౌనో...
ధనమైన మన గోదావరి.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?