లలయీ సింహ్ యాదవ్ గూర్చి తెలుసుకుందాం.

లలయీ సింహ్ యాదవ్ గూర్చి తెలుసుకుందాం.
స్వాతంత్ర్త్య పోరాటంలో పాల్గొన్న ఉద్యోగి.
దళితసాహిత్యంలో మరో కలికితురాయి,
లలయీ సింహ్ యాదవ్ పుట్టిన రోజు నేడు.
1933 లో బ్రిటీష్ పోలీసు విభాగంలో సశస్త్ర సైనికునిగా ఉద్యోగం పొంది స్వాతంత్ర్య ఉద్యమంలో తనవంతు కృషిగా పోలీసు ఆర్మీలో బంద్ చేయించినందులకు 29 మార్చి 1947 లో అరెస్టయ్యారు.5 సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడినది.స్వాతంత్ర్యమొచ్చిన తరువాత కూడా ఆయన జైలులోనే ఉన్నారు.12 జనవరి1948 వరకు మన కోసం ఆయన జైలు జీవితాన్ని గడిపారు.
1950 లో ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత సాహిత్యానికి అంకితమయ్యారు.
ఆయన పేదలు, దళితుల మనిషి.1967 లో ఆయన బౌద్ధాన్ని
స్వీకరించి మనువాదానికి ఎదురు నిలబడ్డారు.
తన పేరునున్న యాదవ పదాన్నితొలగించుకున్నారు.
ఆయనను ప్రభావితం చేసినవారిలో రామస్వామి నాయకర్ ఒకరు. 1993 ఫిబ్రవరి 7 న ఆయన పరమపదించారు.
హిందీ సాహిత్య సేవకి ఆయన కృషి కొనియాడబడినది.
అంగులీ మాల్ ,శంబూకవధ,సంత్ మాయా బలిదాన్, ఏకలవ్య మరియు నాగ యఙము అనే ఐదు నాటకాలు వ్రాశారు.
1926 లో స్వామి అచూతానంద్ యొక్క అనుపలబ్ధ నాటకం సంత్ మాయా బలిదాన్ ని పునర్లిఖించారు.
నాటకాలే కాకుండా మూడు విమర్శనాత్మక పుస్తకాలు వ్రాశారు.
శోషితులపై మతపరమైన మోసం,శోషితులపై రాజనైతిక మోసం మరియు సమాజంలో వైషమ్యాలు ఎలా తొలగుతాయి?
ఇంతే కాకుండా వారు పెరియార్ రామస్వామ నాయకర్ రచించిన అత్యంత చర్చనీయమైన ద ట్రూ రామాయణ్ పుస్తకాన్ని సచ్చీ రామాయణ్ కీ చాబీ పేరుతో రచించారు.
పత్రికా రంగంలో కూడా ఆయన సేవ కొనియాడబడినది.
అశోక్ పుస్తకాలయ్ పేరుతో ప్రకాశక వ్యవస్థని ఏర్పాటు చేసి సస్తా ప్రెస్ ని స్థాపించారు.
కానీ హిందీ సాహిత్య చరిత్రలో ఆయన పేరు లేక పోవడాన్ని, ఆయన రచనలు ఎక్కడా పాఠ్యాంశంగా లేకపోవడాన్ని సాహిత్యంలో జాతిభేదంగా న్యాయవాదవృత్తికి చెందిన మనోజ్ అభిఙాన్ ఫేస్ బుక్ నందు అభిప్రాయ పడ్డారు.
(ఆధారం కన్వల్ భారతి దళిత కవి ,మనోజ్ అభిఙాన్ ఫేస్ బుక్ పోస్టింగ్స్)

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?