పొట్టకూటి కోసం....

పొట్టకూటి కోసం....


ఉన్నోళ్ల చెత్తలో ..
తమ పొట్ట కూడు
దొరుకుతుందని..
వెతుకులాట
నట్టనడి ఎండలో..
ఆశ చేతబట్టుకుని
అభాగ్యుల జీవితాలు
ఆత్రంగా వెతుక్కుంటుంటే
ఏ చిన్న ముక్క దొరికినా
ఏమి ఆనందమో..
తమబోటి వారికి..
పరువేది ! ప్రతిష్ఠ ఏది !
కడుపు నిండితే ..
అదే పదివేలు.
ఇనుప ముక్కలు..ప్లాస్టిక్ కాగితాలు..
టెంకాయ చిప్పలు..
వీటితో జీవితం ..
అలా-అలా ..గడిచిపోతుంది.
ఉన్నోడికి మట్టి గానీ..
లేనోడికి భేదమేముంది
గంజైనా..గలీజైనా..
అన్నీ తనకపురూపమే
చిత్తు కాగితమైనా. .
అదో అన్వేషణ..
జీవితాన్ని గెలవాలనేమి కాదు
నిలుపుకొంటే చాలు
ఇది దీన జనుల మహాకావ్యం,
మానవతా వాదుల ఉతృష్ట గ్రంథం.
మనిషిగా తెలుసుకోదగ్గ చరితం.
(ఫోటో వెంకటగిరి శివారులో ఏటి దగ్గర ఈరోజు నాకు కన్పించిన దృశ్యం.)

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?