గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి


గుర్తుకొస్తున్నాయి
చిన్ననాటి ఙాపకాలు
సజ్జ కంకుల కోతలు
ఎండబెడ్టి గూళ్లు కట్టి భద్రపరచడం
బండిలో రోడ్డుపైన తోలేస్తే
సాయంత్రానికి ..
ఇదిగో ఇలా సజ్జలు
వేరు చేసుకోని గోతాలు నింపుకోవడమే
చేలతో ఆ అనుబంధం నెమరేసుకుంటే
ఎంతో ఆనందమేస్తుంది
మన పల్లె ..మన పంటలు...
కలిసిమెలిసి పనులు చేసుకుంటూ
బతికే జీవితం రాదు...కదా!
పల్లె పట్నమైపోతోంది..
అప్పటి పంటల్లేవ్
చేయడానికి నీళ్లు లేవు
చేసే మనిషి లేడు లేండి
పల్లె అనే గానీ అన్నీ పట్నం నుండే తెచ్చుకోవాలి.
పల్లె అంటే శ్రమ-భుజబలమే..
సాయంత్రానికి ఒళ్లు అలిసేలా పనిచేస్తే
అదో హాయి..
మారిన మన మనసులు
పెరిగిన స్వార్థాలు
వర్గ పోరులు-కక్ష సాధింపు ధోరణులు
పల్లె వద్దు అనే భావన
పట్నం వైపు పరుగులు
మన పల్లె బతకాలంటే ...
కుల -మత,వర్ణ-వర్గాలు పోవాలి
అందరు భేదం లేక కలిసి పని చేసుకోవాలి
భోగ లాలసత్వంలో ఏమిలేదు అనే భావన రావాలి
ఒకరు మరొకరి ఆనందం కోసం ఆలోచించే రోజు
పృథ్వి స్వర్గతుల్యంగా మారుతుంది.
లోకా సమస్తా సుఖినోభవంతు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?