నువ్వు లేక మేము....


                                        నువ్వు లేక మేము....


నువ్వు కనపడిన
ప్రతిసారీ ...
మా గుండెల్లో ఆనందనందనం.
ఆత్మీయ బంధువులా...
నువ్వు పలకరిస్తే...
వళ్ళంతా పులకింతై...
హాయిగా ..
ఆహ్లాదంగా..
పిల్లా-జెల్లా,ముసలి-ముతకా...
గొడ్డూ-గోదా,చెట్టూ-పుట్టా...
ఒకటేమిటి ..
చరాచరము...
నీ దాసోహం.
ఘనమైన నువ్వు
నవ్వితే నవరసభరితం.
గర్జిస్తే ...
జీవానికి ఉరుకూ -పరుగులు.
మా జీవితంలో అనుబంధమై..
నువ్వు మాతో కలిసొస్తే..
కన్నీటి వెతలు తొలగిపోతాయి.
కన్నెర్ర జేసి కడలి తరంగమైతే..
మా బతుకు నీలోనే కలిసి పోతుంది.
అయినా..
మాలా నీకు..
అనురాగ-ఆప్యాయయతలు,
ప్రేమ-దయ-కరుణ -జాలి లేవు.
కానీ...!
నువ్వు లేకుండా ..!!
మేము బతకలేము.


Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?