నన్ను మానవతన నిలిపిన నా గురుదేవులకంకితం

నన్ను మానవతన నిలిపిన
నా గురుదేవులకంకితం
                                                                                                 రచన. పైడాల రవీంద్ర నాథ్,మహారాజపురం.
ఆటవెలది.
 
గుర్తు పెట్టు వాడు గురుడౌను దెలియంగ
లోకమెల్ల జూడ లొల్లి గాదె
నిజము దెలియు నెపుడు జగతి జనులకెల్ల
డాంబికాలు పలుకడాద్యుడు

కుటిల విద్య నేర్ప కుదురందురెటులనో
మానవత దెలుప మాకు వలదు
సమత మమత నేర్ప సవ్యత నొందరు
సకల మెరిగి నటుల సల్పుటేల

జీతగాని వోలె జీవించనెంచనే
గురు భార మెదలి గురువు తిరిగె
పుడమి జనుల నడుప పుణ్య పురుషుడేడి
మాటపెరిగినతని మానమేది

నిక్కమైన వాడు నిజరూపు జూపడే
వేద మెరిగియున్న వేల్పుడేడి
సత్యమున నిలచిన సచ్చీలునకిచట
బతుకు భారమొంది బండయాయె

నిన్ను దెలియునదియె నిజమైన చదువని
చక్కగా దెలిపిరి చదువరులును
నిక్కమెరుగ నెవరు నిఖిలముయందున
నిల్వడేమి నిదియె నిజము గాదె.

ఓనమాలు నేర్పి ఒనగూర్చు విద్యలు
బతుకు దెరువు దెల్పి భవితగాంచు
గురువు లేక నెవడు గుణవతబొందును
దేవుడని పిలువ దేశమెల్ల

కుల మతమని మత్త కూటము లెందుకు
మనిషివన్న గురుతు మరచి పోయి
గురువు జెప్పినట్టి గురుతులొదలి పెట్టి
గుడ్డి బతుకులేల గుణము లేదు

నీతి నియమములను నిక్కచ్చిగా నెంచి
జీవన గమనమొందు జీవుడేడి
సార్థకముల చదువు సాగించి ఘనమైన
మానవత నెరిగిన మనుజుడేడి?

మంచి యన్న వాని మరుగున పడవేయ
కష్ట జీవికాయె కటిక బతుకు
పొలిమేర దాటె పొలమొదలిన రైతు
విలువ లేకపోగ విత్తుడెటుల?

ముసుగు మనిషి మర్మము దెలిసిన గురువేల
భేద బోధజేయ బెదిరి పోయె
బెల్లు బెల్లుయనుచు బెత్తపు దేవుడు
పరుగు పెట్టెనేమి పాఠమొదలి?

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?