రిజర్వేషస్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు,చర్చలు వాదోపవాదాలు.
రిజర్వేషన్లు అంటే ఏమిటి?
రిజర్వేషన్లు ఎవరికుండాలి?
సామ్యవాద దేశంగా భారత దేశం తయారవ్వాలంటే ఆర్థిక, సామాజిక,రాజకీయ రంగాలలో అందరికీ సమాన స్థాయి రావాలంటే అనాది కాలంగా సామాజిక,ఆర్థకంగా వెనుకబడిన షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగలు, వెనుకబడినకులాలు,వికలాంగులు,మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నందునే ప్రాధాన్యతనిస్తూ విద్య,వైద్య వివిధ రంగాలలో ప్రత్యేక కేటాయింపే రిజర్వేషన్.
కాగా కులం మన సమాజ జీవనంలో కీలకపాత్ర పోషిస్తున్నది.
"ఆకలి బాధకన్నా కులావమాన బాధ ఎంతో భయానకమైంది."అన్న దళిత కవి డా.జయప్రకాష్ కర్దం గారి మాటలు నిత్య సత్యమైనవి.
ఎంత చదివినా, ఉద్యోగాలు చేస్తున్నా కులం వల్ల వారికి సమానత రాలేదన్నది అక్షర సత్యం.రిజర్వేషన్ పరంగా తమకు అందిన వాటిని అందుకోలేని దౌర్భాగ్యంలో దళిత కులాలున్నాయి.
రాజకీయంగా పేరు వారిదైనా పెత్తనం మాత్రం అగ్ర కులాల చేతిలోనే ఉన్నాయి.
నేలపైనే కూర్చోని అమాయకంగా,దీనంగా చూసే వారిని మనం చూస్తూనే ఉన్నాం.
పల్లెల్లో కులం కారణంగా దీనమైన జీవితాలే దళితులవి.వారి పనులు నీచమైన పనులుగా ఏనాడో ముద్రపడిపోయింది.
వృత్తుల జీవితాలు దాష్టికంలోనే ఉన్నాయి.
కుక్కనైనా ఇంట్లోకి రానిస్తారు కానీ దళితులని కాదు.
దళితులకిచ్చిన భూములూ చాలా చోట్ల అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నాయి.వారికి కూలి బతుకులే దిక్కుగా ఉన్నాయి.
చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా కులం చూసే బాడుగిల్లు ఇస్తున్న సమాజంలోనే మనం ఉన్నాం.
లక్షలాది రూపాయలు కలిగిన ఉన్నత కులాల వారు ప్రభుత్వ ప్రత్యేక లబ్ధి పింఛను తదితర లాభాలు పొందుతున్నారు.నిజమైన పేదలు దళితులు అందకోలేనివారు ఉన్నారు.
రిజర్వేషన్ తొలగిస్తే భారతదేశం సామ్యవాద దేశంగా ఎదగడం కలే.
మానవత్వంతో ఆలోచిద్దాం.నిజంగా దళితులు ఉన్నతి సాధించారా?
దళితులను సమానంగా అంగీకరిస్తున్నారా?
జనాభా ప్రాతిపదికన ఆలోచిద్దాం.కులాలవారి జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నారా?
రిజర్వేషన్ అంటే వేరే వారివి మనకు కాదు.మనకు రావల్సినవి.జనాభా ప్రాతిపదికన చూస్తే అవి ఎంతవరకు అందుకున్నామో తెలియదా?
అక్కడక్కడా పని చేస్తున్న దళితులు వారి అధికారాన్ని వారే చెలాయిస్తున్నారా?
నిజం మన హృదయాలకే తెలుసు.
లోకా సమస్తా సుఖినోభవంతు.
అందరం బతుకుదాం.కలిసిమెలిసి జీవిద్దాం ఆనందకర జీవితాన్ని ఆస్వాదిద్దాం.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?