మనిషిని చూసి మనిషే భయపడుతున్నాడు.


మనిషిని చూసి

మనిషే భయపడుతున్నాడు.


ఇందుకేనా! భయం!!
మనిషిని చూసి
మనిషే భయపడుతున్నాడు.
కులం పేరుతో..
మతం పేరుతో..
ధనం కోసం..
తన వారి కోసం..
మనిషి జంతువైనపుడు
మనిషిని చూసి
మనిషే భయపడుతున్నాడు.
న్యాయం..
ధర్మం ...
ఙానం ..
విఙానం..
నాగరికత..
అన్నీ తెలిసిన మనిషి
అర్థబలం..
అంగబలం..
వర్ణబలం..
వర్గబలం..
జాతిబలం చూపిస్తూ
మనిషి జంతువైనపుడు
మనిషిని చూసి
మనిషే భయపడుచున్నాడు.
విలాసం..
వినోదం..
ఉల్లాసం..
ఉన్మత్తం..
కలుపుకున్న మనిషి
స్వార్థం..
కుటిలం..
కుతంత్రం..నేర్చిన మనిషి
రాజకీయ రంగేసి
చట్టం తన చుట్టమంటూ
వికట్టహాసం చేస్తూ..
మనిషి జంతువైనపుడు
మనిషిని చూసి
మనిషే భయపడుచున్నాడు.
అడవిని..
ఆడవారిని..
దీనుల్ని..
దు:ఖితుల్ని ..
నిలువునా దోచేస్తూ
తన ఉనికి కోసం
మనిషి జంతువైనపుడు
మనిషి చూసి
మనిషే భయపడుచున్నాడు
.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?