ఉమ్మడి కుటుంబాలు నశించి పోగా
బిడ్డలు పట్టించుకోకపోగా
ఎందరో అమ్మా నాన్నలు,
అవ్వా తాతలు..
అనుభవాల సారానికి
నేటి తరం ..విలువివ్వకపోగా
నిర్లక్ష్యానికి గురి చేస్తూ...
ప్రగతియనుచు పరుగులు పెడుతుంటే..
తమ బ్రతుకే తమకు ముఖ్యమనుకుంటుంటే..
ఆ పండుటాకులు..
అనాథల్లా బిక్కుబిక్కుమంటూ ..
శ్మశానాలల్లో..
రోడ్ల వెంబడి..రైల్వే స్టేషన్లలో..
ఫుట్ పాత్ ల వెంబడి
అడుక్కోనూ శక్తిలేక
సొమ్మసిల్లి పడిపోతుంటే..
నూతులు గోతులు చూసుకుంటుంటే..
ఆ రాజ్యం చూస్తున్న
మానవత కన్నీరొలుకుతోంది.
వృద్ధాశ్రమాల ఏర్పాటుతో
వారికి ఆశ్రయం కలుగుతుందని
ఆశిద్దాం.
లోకా సమస్తా సుఖినోభవంతు.
జై భారత్.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?