నేనెవ్వరికి అర్థం కాలేదు..

నేనెవ్వరికి అర్థం కాలేదు..


నేనెవ్వరికి అర్థం కాలేదు.
నా మాటలు...
నా రాతలు...
నేటి కాలానికి సరిపోలేదు.
వెనక్కి తిరిగి చూసే రోజు
నేను అందరికీ కనబడతానులే..!
మనిషిని మనిషే హేళన చేస్తూ
నీచంగా చూస్తుంటే...
నాలోని ఆవేదన ఉప్పొంగింది.
ఆకలి చేతబట్టుకుని ..
ఎంగిలి విస్తర్లలో పసి బాల్యం
మెతుకులు వెతుక్కుంటుంటే
నాగుండె కన్నీరయింది.
మానవత కొన ఊపిరితో
కొట్టు మిట్టాడుతుంటే..
నా ప్రాణం ఊగిసలాడింది.
జీవిత సత్యమేంటాయని
తనువు మరచి తల్లడిల్లాను.
నా వేదనా..
నారోదనకి..
నాలుగు గోడలే ప్రతిరోధించాయి.
జీవితానికి గిరులు గీసుకుని
నేను కూర్చోలేను.
గుడ్డిగా తారాడే లోకం వెంట
పరిగెత్తలేను.
కాలంతో కరిగిపోలేను
సమరానికి కాలు దవ్వలేను
గౌతముని బాటలో
అంబేద్కరుని ఆశయ సాధనలో
సత్యంతోనే నిలబడిపోతాను.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?