నలిగి పోతున్న బాల్యం

నలిగి పోతున్న బాల్యం

గంటల తరబడి ..
గాంధీ తాతలా ..
రంగేసుకుని..
వీథిన, బజారల్లో
అలా నిలబడుతూ..
డబ్బులను యాచిస్తూ ..
తిరుగుతూ -నలుగుతున్న
పసి బాల్యం..
అందరూ చదవాలంటున్నాం..
అదరూ ఎదగాలంటాం..
ఎప్పటికి తీరేనో
మన కలలు.
వళ్ళంతా రంగేసి
పొట్టకూటికోసమని...
బజారుకు తోసేసి
పిల్లల సంపాదన యాచించే
తల్లిదండ్రులున్న సమాజం మనది
కళ్ళు ఎర్రబడిన లేత చిగురు..
నవ్వలొచ్చి మధ్యలో గోకుకుంటుంటే
చేతి సందుల్లో పుండై కనబడుతుంటే
ముద్దైన పసి బాలుని కన్న
అమ్మా నాన్నపై ఆవేదాగ్ని..
అశ్రు నయనాలైతే..
ఆ తల్లి పొట్టకూటికి లే స్వామీ..
ఫోటో తీసి పేపర్లలో పెట్టొందంటే..
నాలో ఏ మాటల్లేవ్
వారి జీవితంలో వెలుగు నింపే శక్తి
నాకెక్కడిది!?
మీతో పంచుకున్న ఈ క్షణమైన..
నాలో కలిగిన
ఈవ్యథ తొలగిపోదా!?
మానవతా సమాజం...
అమాయక,దీన జనులవైపు
కాస్తైనా తొంగి చూడదా!!?
లోకా సమస్తా సుఖినోభవంతు.
(నెల్లూరు జిల్లా వెంకటగిరి టౌన్ లో నేను చూసిన దృశ్యాలు)

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?