నమ్మకాల వెంట నా జనం

నమ్మకాల వెంట నా జనం
నేను ముందంటే నేను ముందనుచూ..
ఒకరిమీదొకరు చేతులు చాచుకుంటూ..
మారేడు,మంచిపత్రి,మామిడి,మరువం, మద్ది,
వావిలాల,వాకుడాకు,విష్ణుక్రాంతం,
గన్నేరు,గండకి, గరికె, రేగి, రావి,
ఉమ్మెత్త,ఉత్తరేణి,తులసి,తెల్లజిల్లేడు,
దేవదారు,దానిమ్మ,జమ్మి,జాజి,
21 రకాల పత్రాలు,మట్టి వినాయక ప్రతిమ
నాకంటే నాకనుచూ..
నమ్మకం వెంట ఉరుకు-పరుగుల జనం.
పుణ్యం నాకేయనుచూ..
పదుల అడుగుల విగ్రహాలు..
కొబ్బరికాయ,పిండివంటలు,
వడపప్పు,పానకం,ఉండ్రాళ్లు,కుడుములు,
అరటిపండ్లు,తదితర ప్రసాదాలు..
ముప్పూటలా భోజనాలు.
ఎవరి అలజడి వారిది..
త్రాగి తూలుతూ జై జై నాయకాయనుచూ..
ఎటు చూసినా హంగామా..
ఊరు -వాడెల్లా మైకులమోత
దేశమెల్ల సంప్రదాయాల గుప్పిట
విఘ్నరాజాయని ...
వినాయకోత్సవ విలాసం.
నెట్లో సెల్ఫీలు..రకరకాలుగా మేకింగులు
భక్తియోగాన్ని విడచేసి
ప్రశాంత తత్వాన్ని వదిలేసి
అలజడిలో, ఆధిపత్యపు జోరులో
కుర్రకారు హోరులో, సామూహిక పోరులో
నమ్మకాల ఒడిలో ఒదిగిపోతూ..
తనేమిటో మరచిన నా జనం
నమ్మకాల వెంట నా జనం.
(ఫోటోలు రాజంపేట పాత బస్డాండు ప్రాంతం కడప జిల్లా)

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?