ఆర్థికంగా వెనుకబడినవారు కోట్లకు పడగలెత్తగలరు.
అంటరాని కులాన బుట్టిన వారి జీవితాలు ఉన్నత కులమందుకోవడం చరిత్రలో జరగలేదెందుకని..
వేలాది సంవత్సరాల ఊడిగపు బతుకు
అనాదిగా పేదరికాన కన్నీళ్లు తాగుతున్న వారు
ఎప్పుడూ ఎవరికి కనపడలేదేమి...
బతుకు దెరువున వెనుకబడిన ఉన్నత కులాలు
ఎప్పటినుండి ఉన్నాయి,ఎంత శాతమున్నాయి.
జనాభా ప్రాతిపదిన అందవలసినవి దళిత జాతులకు అందాయా!
ఆర్థికంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశ పెడుతోంది.
ఆర్థికం కన్నా ఆత్మాభిమానం గొప్పది కదా ..దళిత జాతులు ఆత్మాభిమానంతో జీవించే సామాజములో మనమున్నామా!
దళిత కులాల వారు ఉన్నత కులాల ఇంటిలోకొచ్చి వారి మంచం మీద కూర్చోని వారి గిన్నెలో అన్నం తినే సమాజం మనదా!
ఇంటి ముందు గంజు తీస్తే..ఊరి మురికి శుభ్రం చేస్తే మనకు తెలుస్తుంది వారి జీవితమేమిటో ...!
వేలాది సంవత్సరాలుగా ఉన్నత కులాల సుఖములు చూస్తున్న బతుకులవి.
సమంగా బతుకడానికి వారిని అడుగులు వేయనిద్దాం.
మానవతతో ఆలోచించి చూద్దాం
రిజర్వేషన్ ఉండాలో వద్దో...!!

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?