మన జెండా..


మన జెండా..


నీలాకాశంలో..
ఢిల్లీలో ఎర్రకోటపైన
పాఠశాలల్లోనా...
ప్రభుత్వ కార్యాలయాలలోనా..
మన ఇండ్లపైనా...
మన గుండెల్లోనా
ఎగిరే మన జెండా..
ముచ్చటగా..
మురిపెంగా..
ఎంత హాయిని అందిస్తుందో..
ప్రతి భారతీయునికి..
భావాల తరంగము
ఐక్యతా రాగము..
సుందరము ఆ రూపము
మన అందరి నోట
జయ జయ రాగం
ఎంత మనోహరమో..
మన గౌరవ వందనం.
దేశ దేశాన మన మన రూపం
మన భారతీయ తేజం.
తేజరిల్లుచుండ
పొంగిపోవునే మన అంతరంగము.
(మన జెండాను గౌరవిద్దాం.ఎండ వానకు తడవనివ్వకుండా,కాల్చకుండా, విలువగా, అపురూపంగా చూసుకుందాం.ఇక్కడ ఎగిరే జెండా ఆగష్టు పదిహేనున కట్టి ఇప్పటికీ విప్పలేదు.అక్కడక్కడా ఎండకు వానకు తడుస్తూ కనబడుతున్నాయి.అలా చేయకండి)

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?