ఆడపిల్లంటే ఎంత అలుసో !

ఆడపిల్లంటే ఎంత అలుసో !

ఆడపిల్లంటే ఎంత అలుసో !
సింధు నాగరికత నుండి విస్తరించిన మన నాగరికత తన స్వరూపాన్నే కోల్పోయింది.
సింధు నాగరికతలో కుటుంబ పెద్దగా తల్లే ఉండేది.
ఇంటి లావాదేవీలన్నీ తల్లే చూసేది.
చరిత్ర చెబుతున్న సత్యాలు.
ఆర్యుల రాకతో సింధు నాగరికత స్వరూపం మారిపోయింది.
తండ్రి కుటుంబ పెద్దయ్యాక తల్లి స్థానం తగ్గిపోతుంది.
స్త్రీ అబల అన్నభావన వచ్చింది.
వంటింటికి పరిమితమై తన ప్రాబల్యం కోల్పోయింది.
మనువాదం తన పాలిట శాపమైంది.
ప్రకృతి ప్రేమికులైన అనార్యులు ఆర్యుల ప్రభావానికి లోనై త్రిమూర్తి ఆరాధన మొదలయింది.
మధ్య యుగంలోను స్త్రీకి గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి.
ముస్లిముల పాలనలో స్త్రీ ఆటబొమ్మగానే చూడబడింది.
స్త్రీని బహుమతిగా ఇచ్చేవారంటే ఎంత హీనమైన స్థితిని కలిగించారో అర్థమౌతుంది.
శూద్రుల వలే స్త్రీకి విద్య దూరమయింది.
బాల్యమునందే పెళ్లి చేయడం, భర్త చనిపోతే సతీసహగమనం చేయడం.
స్త్రీకి ఈ స్థితికి కారణమెవరు?
మన ధర్మ సంప్రదాయాలు కావా?
దళితుల వలే వేలాది సంవత్సరాలుగా తన జీవితం దాస్య సృంఖలాలలోనే ఒదిగిపోయింది.
మన సంస్కృతిలో స్త్రీకి మనమిస్తూ వచ్చిన గౌరవం ఏ పాటిదో..!
ఏం చెప్పినా నోరు మూసుకో ఏం తెలుసు నీకు అని అణచివేస్తూ వచ్చిన సమాజం మనది కాదా!
ఆడపిల్లకు కట్నకానుకలు ఇచ్చి సగౌరవవంగా భర్త కాళ్లు కడిగి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే ఆచారం మనది కాదా!
మనుధర్మం కాదా!
స్త్రీ జన్మ పాపపు జన్మ పేర్కొన్న మన గ్రంథాలు, మన సమాజంలో నాటిన విష బీజాలు కావా!
భార్యకు భర్తయే ప్రత్యక్ష దైవమని కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలని చెప్పింది మన శాస్త్రాలు కావా!
ఎంత కాలం వంచిస్తూ దళితుల,స్త్రీల జీవితాలకి కన్నీటిని నింపుతారు.
కొడుకు పున్నామ నరకం నుంచి తప్పించేవాడని,కొడుకు కొరివిబెడితేనే, శ్రాద్ధకర్మలు చేస్తేనే స్వర్గానికి పోతారని కల్పనలు చేసిందెవరు? వాటికి శాస్త్రాలని మత విశ్వాసాలను చుట్టిందెవరు?
నేడు ఆడబిడ్డ బ్రతుకు ఏమవుతోంది?
మనం చదువుకుంటున్నాం.బాబా సాహెబ్ అంబేద్కర్ శాసనంలో మన సమాజం నడుస్తుంది.
కానీ మన మానసిక పటలము నుంచి మనువాద రేఖలు పోనే లేదు.చదువుకున్నా మూఢ భావాలే తనని సాధిస్తున్నాయి.
శాస్త్రీయ దృష్టికోణం లేదు.వాస్తవాన్ని పసిగట్టే విద్య మనకు రాలేదు.సత్యాన్వేషణ లేదు.స్వంత ఆలోచనల నిర్మాణమేది?
మనచుట్టూ కాలం చెల్లిన ధార్మికత పట్టుకొనే వ్రేలాడుతున్నాడు.
అందుకే మూర్ఖపు ఆలోచనలే మన తలకాయల్లో మెదులుతన్నాయి.
ఆడబిడ్డకు చిన్న చూపులు తొలగిపోవాలి.
తను సంపాద పరురాలవ్వాలి.
విద్య,ఉద్యోగాలలో తను అసమాన ప్రతిభను ప్రదర్శించాలి.
కంటే కూతుర్నే కనాలనే భావన రావాలి.
కట్న కానుకల విధానం రూపు మాసి పోవాలి.
సమానతలో అందరూ సుఖ జీవనం సాగించాలి.
లోకా సమస్తా సుఖినోభవంతు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?