ఎవరు?

ఎవరు?ఎవరు?

 జీవితానికి సరియైన పరిభాష
చెప్పిందెవరు ?
నాలుగు గోడల మధ్యనే నలిగి పోయి
ఆలోచనలతో ప్రపంచాన్ని చుట్టేస్తూ..
విశ్వాంతరాల్ని పరికిస్తూ..
సమాజ శ్రేయస్సుకే అంకితమై..
సత్యంగా బ్రతికేసిన
దివ్య తేజోమయులు చెప్పిన
ఆ మర్మాలేమిటి ?
వేద వేదాంగాలు, పురాణేతిహాసాలు
గీతా మకరందాలు,బైబిల్,ఖురాన్ లు
చెప్పిందేమిటి ?
బుద్ధుడు,నానక్,వర్ధమానులు,మహమ్మద్,జీసస్
విప్పినవేమిటి ?
మహాత్మాఫూలే,రామ్మోహన్ రాయలు,
దయానందులు,రామకృష్ణులు,వివేకానందులు
అంబేద్కర్,పెరియార్ సంస్కర్తలు,నారాయణ గురుదేవులు
సామాజిక సంస్కరణలకు,మానవతా విలువలకు
పోరాటాలేమిటి ?
గాంధీ,నెహ్రూ,పటేల్ శాస్త్రుల రాజకీయ
పోకడలేమిటి ?
జీవితానికి సరియైన పరభాష
చెప్పిందెవరు ?
ఆశల గూడు చెరిపేసి
శరీర గూడులకు చెదలు పట్టించేసి
కారడవుల్లో కాఠిన్యంతో
యోగులు, ఋషులు,మునులు
ఇచ్చిందేమిటి ?
జనన మరణ ఆంతర్యాలను
జీవిత యథార్థాన్ని పరికించి
పలికిందెవరు ?
యుగాలు గడచినా,తరాలు మారినా
జీవితానికి సరియైన పరిభాష
చెప్పిందెవరు ?

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?