ఏంటో! ? లోగుట్టు పెరుమాళ్కెరుక !

ఏంటో! ? లోగుట్టు పెరుమాళ్కెరుక !


ఏంటో! ? లోగుట్టు పెరుమాళ్కెరుక !
ఉరుకులు పరుగులేంటి ?
తొక్కిసలాటలేంటి ?
ప్రసాదాల కోసం ఎగబడి
తిట్టుకోని కొట్టుకొని
చనిపోవడమేంటి ?
నాదేవుడే గొప్పని వింతగా
ఈ గొప్పలేంటి ?
దేవుని ఊరేగింపుల్లో మాతల తైతక్కల
నగ్న నృత్యాలేంటి ?
ఉత్సవాల చెంతన మదిరాల మత్తులో
తూగిసలేంటి ?
నేనే ముందు నాకే పుణ్యం
వెర్రితనాలేంటి ?
కులాలు మతాలు వర్ణాలు వర్గాలు
బలాబలాలేంటి ?
కోట్లాది వేటలో పరుగులు పెడుతూ
అలసటేమిటి ?
అపసవ్యంగా అర్జిస్తూ
వికట్టహాసాలేంటి ?
కాలం మారేకొద్ది బ్రతకడం
మరచిపోతున్నాడేంటి ?
చెవుటోడి చెవిలో శంఖం
ఉపయోగమేది ?
అష్టావక్రుడైన మనిషికి చివరకు
మిగిలిందేమిటి ?
యుగాలు తరాలు మారినా మనిషి
నేర్చుకొన్నదేమిటి ?
విఙాన యుగంలో మనిషిలో
మార్పేది ?

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?