గెలుస్తాను ...నిలుస్తాను.

గెలుస్తాను ...నిలుస్తాను.

గెలుస్తాను ..
ఏదో ఒకరోజు గెలుస్తాను.
నమ్మకం చేతబట్టుకుని..
శ్రమను తోడు చేసుకుని..
ధైర్యాన్ని కూడదీసుకుని..
నడుస్తున్నాను
నేనుగా నడుస్తున్నాను.

మానవతకు బాసటగా ..
కలంతో నిలబడాలని
సదాశయంతో..
నిరంతర దీక్షతో..
లోక క్షేమానికై..
నావంతుగా నేను..
ఒక ఆలోచనా బీజాన్నైనా కాగలనని
తపనతో నడుస్తున్నాను.
గెలుస్తాను ..
ఏదో ఒక రోజు గెలుస్తాను
జీవితాన్ని గెలుస్తాను.
సగర్వంతో మీ కళ్లు చెమర్చేలా
స్వరం మూగబోయెలా...
నిలుస్తాను ..
మీ అందరి ముందు నిలుస్తాను
నవ చైతన్యంతో నిలుస్తాను

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?