నిజమైన మనిషి.

నిజమైన మనిషి.

నిజమైన మనిషి.
పగలు-ప్రతీకారాలు విరోధాలు కాదు..
కుటిల-కుతంత్రాలు స్వార్థాలు వద్దు..  
భేదాలు-విభేదాలు తూలనాడుట విడనాడి..  
మమత-సమతతో మనుగడ కొనసాగిస్తూ..  
కలిసి-మెలిసి నడుస్తూ కాలంతో అడుగేస్తూ..
 ఙానపు వెలుగుల్ని వెదజల్లుతూ ..
 తేజోమయుడైన మనిషే నిజమైన మనిషి.
ప్రగతి పథంలో ..
 తన నడక మరో సమాజానికీ...
  ఆనందమై..ఆదర్శమై నిలకడగా నిలబడితే..  
తెలుగు-వెలుగు భారత పుంజాన్ని..
 వేనోళ్ళ కొనియాడేలా..
 నేను సహితమంటూ..
మానవతా జ్యోతిగా నిలబడినయతడే ..
నిజమైన మనిషి.
రాజకీయ చదరంగం  
పావులాట వద్దు
నా జాతికి నేనేమి చేశామన్న నిజమైన యోచనతో..  
స్వపక్షమైనా..విపక్షమైనా..
మంచిని పెంచుకుంటూ..  
ఎందరికో నీడై..
మరెందరికో చేదోడు-వాదోడై ..
  భావితరానికి బాటలు వేసుకుంటూ..
  శ్రమంటే నేనంటూ..
 అంతరంగాన్ని పరికించుకుంటూ..
 గడచిన జీవితమే ..
 ఘనమైన జీవితం.  
వారేమి చేశారు...వీరేమి చేశారు...
 నిరంతర పోటీలు కాదు
 నేనేమి చేశానన్న యోచనజేయునతడే..
నిగ్గు తెలిసిన మనిషి..  
నిజమైన మనిషి.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?