గతం ... భావి జీవితం

గతం ... భావి జీవితం

గతం కాదు భావి జీవితం
ఆ మూగ భాషలో..
ఎన్నో జన్మాలు గడచిపోయాయి
లోకాన్ని మరచిపోయి..
మధురానుభూతుల్లో నిలచిపోయాను
ప్రతి అడుగులోనూ..
తేజోపుంజ దర్శనమే అయ్యింది
ప్రతి శ్వాసలోనూ..
దివ్య నామ జపమే జరిగింది
ఆకలి తెలియని దినాలు..
ఎన్నో ఆనంద గీతాల ఆలాపనైంది
బంధం-అనుబంధానికి..
చెట్టు-చేమలే సాక్షమయ్యాయి
పసి పిల్లల క్రీడలుగా..
నేను అభివర్ణించుకోలేపోయాను
గడచిన గుర్తులనుబట్టి..
ఆంతర్యం బోధపడుతుంది
లోక క్షేమమే..
ఆ కలయికని తెలియలేకపోయింది
ఆశయాలు వల్లిస్తున్నా..
ప్రతి పదము నీదే అయింది
జీవితానికి మనస్సాక్షివై..
సమాజశ్రేయస్సుకు భాగమని అనుకోలేదు
గతం వర్తమానానికి ..
నాంది అవుతుందని నాడెరుక లేదు
గతమే భావి జీవితమని..
స్పృహలోనైనా లేకపోయింది.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?