నిజం..నిజం..

నిజం..నిజం..

నిజం నిష్ఠూరంగా ...
చేదుగా...
మనసుకు మింగుడు పడకుండా..
వెటకారాన్ని..
కలిగించడం కద్దు.
నిజమే ..జీవం .
నిజమైన వ్యక్తికి ..
తన నడకకి ఇంధనమై..
తనకు చురకై ..
తన కదనాలకి తేజస్సై ..
స్పృహ కలిగించినందుకు...
కృతఙతయై..
ఖచ్చితమై నిలబడితే..
తన వదనములకది చిరుదరహాసం
అదియే లోక కల్యాణం.
నిజం జీర్ణించుకోలేక పోతే..
ఈర్ష్యయై ..
నాశనానికి అడుగు..
స్వార్థాల గూటికి..
తన పతనానికి హేతువై..
దు :ఖానికి మూలమై..
నిలబడదా! ..
సమాజం మంచి-చెడుల సమన్వయం
మంచిని యెంచి నడచుకుంటే..
మానవ మనుగడ సుఖమయమే!
మనువాదంతో నడక..
కొందరికి కన్నీళ్లు..కొందరికానందం.
నిజాన్ని బతికించుకుని
నిజం వైపు నిలబడితే..
నిజంగా జీవిస్తే..
అందరి జీవితం ఆనందమయమే!
లోకా సమస్తా సుఖినోభవంతు.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?