అన్నదాతకు ఆ హుందాయేది

అన్నదాతకు ఆ హుందాయేది

అన్నదాతకు ఆ హుందాయేది
బిచ్చగాని జోరు హుషారైంది
పొలం నమ్మే రైతుకి
విలువలేని బ్రతుకైపోయింది
చేతగాని పనిగా మారి పోయింది
సేద్యమంటే మన నోటి కూడు
పచ్చని పొలాలే మన జీవం
కాలం మారింది
పని చేసే మనిషి కరువైపోయాడు
కలం పట్టిన చెయ్యి
హలం పట్టనంటోంది
నాగరికత రంగు పూసుకొని
అంతర్జాలంలో తిరుగాడుతోంది
శ్రమకు విలువ పోయింది
పైర్లు రైతును వెక్కిరిస్తున్నాయి
సేంద్రియ ఎరువులు లేకపోగా
దిగుబడి తగ్గిపోయింది
రసాయన ఎరువులు
అరచేతిలో స్వర్గం చూపించి
మనోవ్యథకు దారి చూపాయి
అనుకున్న ఫలితాల్లేవు
ఆశల మాయలోడు తనను పీకుతుంటే
అప్పలోడు గుండె మీద దరువేస్తుంటే
సంసార సాగరం ఈదలేక
జీవితం నడపడం చేయలేక
మోసాల గుప్పిట్లోకి పోలేక
నిజాయితీకి తను నిలబడలేక
కాలం చేసుకుని
అందరిలో కన్నీళ్లు నింపేసి
రైతు మరో దారిలో వెళ్ళిపోతున్నాడు.
రైతు కన్నీటి సాగరంలో మునిగిపోతున్నాడు
విష గులికల్లో కలిసిపోతున్నాడు
ఎండ్రిన్ డబ్బాలో దాక్కుంటున్నాడు
మన అన్నదాత
మనకు కనబడకుండా
కనుమరుగై పోతున్నాడు
మనిషిన్న మనం రైతును బ్రతికించుకోకపోతే
రాతికన్నా హీనమైన జీవితం మనది కాదా!!
రైతు రాజు కాదు,రైతు కూడా కాకుండా పోయాడు.
కారుణ్య జీవితమై కనికరం కోరుతున్నాడే!!

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?