ఓ నా సమాజమా!

ఓ నా సమాజమా! 

ఓ నా సమాజమా!
ఏమిటి నీ క్రూర తత్వం..
నాతో ఉండమంటావు
నామతమే నీ మతమంటావు..
నీవు కల్పించుకున్న
రాతిబొమ్మ చెంతకు రావద్దంటావు
మతంమత్తు .. మందు మత్తులో
మనిషివనే మరచిపోతావు
క్రూర జంతువు కన్నా హీనమై
మానవత్వాన్నే మింగేస్తావు
దేవుడు నీవాడా!
దెయ్యము నీదేనా!
శ్రమకు ప్రతిరూపమై..
నీ బ్రతుక్కే పునాదియై..
నీ ముందున్న దళితుని
మనిషిిగా చూడలేవెందుకు!?
ఎంతకాలం ఇంకా ఎంతకాలం
నిజమైన మనిషికి
కల్మషం లేని మనిషికి
కుట్రలు -కుతంత్రాలు లేని
మకుటం లేని మహారాజుకి
కాటి కాపరి జీవితం.
నీవు సత్యాన్ని తెలుసుకునేదెప్పుడు
కబీర్ ని తోసేశావు..
బుద్ధుని కాదన్నావు..
స్వార్థ కూపంలో ..
వికట్టహాసం చేస్తున్నావు..
నీవు మోసానివి..
నీ అధర్మాన్ని ఏం నమ్మాలి!?
కాకమ్మ కథలు కాదు
వాస్తవం కావాలి.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?