నేను జీవితాన్ని..

 నేను జీవితాన్ని..

నేను జీవితాన్ని..
విద్యుక్త ధర్మానికై
నిలబడ్డా వీథిలో..
మరో సహారా కోసం...
వీథిలోని గుంతలు
నన్ను వెక్కిరిస్తున్నాయి..
వర్షానికి చేరిన
బురద నీటితో..
తొణికిసలాడుతూ
పరిహాసం చేస్తున్నాయి..
నేను వాటినే చూస్తున్నా..
పరిశీలనగా పరికిస్తున్నా..
అటునిటు వెళ్లే వాహనాలు
బురద గుంటలు తప్పించుకుంటూ
మీదికి దూసుకొస్తున్నాయి..
కొన్నేమో వాటిమీద దూసుకెళ్తూ
మురుగు నీటిని మీదికి
వెదజల్లుతున్నాయి.
తెల్లగుడ్డల నన్నుచూసి
వాటికి కన్ను కుట్టిందేమో..!!
వాటికి నాపై ప్రేమెక్కువైందేమో..!!
నేను వేసుకున్న పైమెరుగుల
బట్టలే వాటికి తెలుసు
వాటినీ ప్రేమించే ..తత్వం నాదని
వాటికి తెలియనే లేదు
నాలోపలి ఆంతర్యం
అవెప్పటికీ కనుక్కోలేవు
స్థలమా..అణువు కాదు ..
కాలమా .. సరికాదు ..
ఎదురొడ్డి నిలబడలేను..
నాకు తగదు..
నేను మనిషిని..
ఆశయాల భారంతో
అడుగేసుకుంటూ..
మెల్లగా మరో చోటికి
సర్దుకుపోతున్నా. .
నేను జీవితాన్ని..
నేను ముందుకు జరిగిపోతున్నా..

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?